యాజమాన్యానికి అదే ఇష్టమని రిపోర్టర్ అత్యుత్సాహ పడ్డాడో లేక, యాజమాన్యమే చెప్పి రాయించిందో, లేక చంద్రబాబు నుండి డైరక్షన్ వచ్చిందో తెలియదు కానీ.. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ పై తొలిరోజు తీవ్రస్థాయిలో విషం కక్కింది ఆంధ్రజ్యోతి. అమిత్ షా జగన్ కి క్లాస్ తీసుకున్నారని, ఏపీ వ్యవహారాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారని కట్టుకథలు రాసింది. ఈ “కమ్మ”ని కట్టుకథల్ని ఎవరూ విశ్వసించలేదు సరికదా.. ఫుల్లుగా చీవాట్లు పెట్టారు.
బాబు ఉప్పు తిన్న విశ్వాసం ఉన్నా కూడా ఈనాడు బ్యాలెన్స్ డ్ గా వార్త ఇస్తే.. జ్యోతి ఓవర్ యాక్షన్ మరీ నీఛంగా తయారైందని ఈసడించుకున్నారు నెటిజన్లు. దీంతో రెండో రోజు మీటింగ్ విషయంలో తప్పు తెలుసుకుని లెంపలేసుకుని మరీ ఉన్నది ఉన్నట్టు రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి.
రెండోరోజు సమావేశంపై చంద్రజ్యోతిలో ఏం వచ్చిందంటే.. “కేంద్ర మంత్రి అమిత్ షా తో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.” అని ముక్తాయించింది. ప్రత్యేకంగా నిన్న జరిగిన సమావేశంపై కూడా క్లారిటీ ఇచ్చింది. “నిన్న సాయంత్రం అమిత్ షా తో 40నిముషాలపాటు భేటీ అయిన సీఎం జగన్.. కోర్టులు, న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులు, ఇతర అనేక అంశాలపై చర్చలు జరిపారు” అని రాసుకొచ్చింది.
కోర్టుల వరకు బాగానే ఉంది కానీ, న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులు అనే పదమే బ్రహ్మపదార్థంగా మారింది. అసలు ఏ న్యాయమూర్తిపై ఎవరు దాడి చేశారు? ఏదో రాయబోయి, ఇంకేదో రాసినట్టుంది చంద్రజ్యోతి. కన్ఫ్యూజన్లో అసలేం రాస్తున్నారో తెలియక, తికమకపడ్డారు చంద్రజ్యోతి జర్నలిస్ట్ లు.
అమిత్ షా నిజంగానే నిన్న జగన్ కి క్లాస్ తీసుకుని ఉంటే, మరి దాని కొనసాగింపు ఈరోజు జరిగి ఉండాలి కదా? ఈరోజు కూడా అమిత్ షా మరింత పెద్ద క్లాస్ తీసుకుని ఉండాలి కదా? ఈరోజు జ్యోతిలో వచ్చిన వార్తలో కనీసం ఆగ్రహం అనే పదమే లేదు. అంటే నిన్న తాను రాసిన వార్త తప్పు అని ఆంధ్రజ్యోతి పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది.
వరుసగా కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణాలపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ టూర్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అందులోనూ ప్రత్యేకంగా హోం మంత్రి అమిత్ షా తో ఆయన భేటీ కావడంతో.. సీబీఐ విచారణపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని అనుకున్నారంతా.
అదే జరిగితే, వైసీపీ కోరుతున్నట్టు ఆ రెండు విషయాలపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తే చంద్రబాబుపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. బాబు, చినబాబు ఇద్దరూ కటకటాలు లెక్కపెట్టాల్సిందే. ఇన్నాళ్లూ స్టేలతో కాలం గడుపుతున్న బాబుని కేంద్రం సాయంతో జగన్ పూర్తిగా కార్నర్ చేసినట్టవుతుంది. అందుకే జగన్ పర్యటనపై జ్యోతి విషం చిమ్మాలని చూసింది. తీరా ఆకాశంపై వేసిన ఉమ్ము తిరిగి జ్యోతి మొహానే పడేసరికి ఈరోజు దాన్ని తుడిచేసుకునే ప్రయత్నం చేసింది.