ఉత్తరాంధ్రాకు ఉపద్రవం…?

ఉత్తరాంధ్రా జిల్లాలు పండుగ వేళ టెన్షన్ పడుతున్నాయి. దానికి కారణం తుఫాను. అవును మళ్ళీ తుఫాను తోసుకువస్తోంది. సరిగ్గా పదిహేను రోజుల క్రితం వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్రాకు అతలాకుతలం చేసింది. Advertisement నిజానికి అక్టోబర్…

ఉత్తరాంధ్రా జిల్లాలు పండుగ వేళ టెన్షన్ పడుతున్నాయి. దానికి కారణం తుఫాను. అవును మళ్ళీ తుఫాను తోసుకువస్తోంది. సరిగ్గా పదిహేను రోజుల క్రితం వచ్చిన తుఫాన్ ఉత్తరాంధ్రాకు అతలాకుతలం చేసింది.

నిజానికి అక్టోబర్ నెల అంటే తుఫాన్ నెల అని భావిస్తారు. అయితే మరీ ఇంత తక్కువ‌ తేడాలో వరస తుఫాన్లు అంటే తట్టుకోవడం కష్టమే.సెప్టెంబర్ నెల చివరలో వచ్చిన గులాబ్ తుఫాన్ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖ రూరల్ జిల్లాను అతలాకుతలం చేసింది.

ఇపుడు మళ్ళీ మరో తుఫాన్ వచ్చింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల ఈ అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న ఇపుడు ఉత్తరాంధ్రా జిల్లాలలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ఈ నెల 17 వరకూ దీని ప్రభావం ఉంటుందిట. ఇక ఉత్తరాంధ్రా జిల్లాలే మరో మారు టార్గెట్ అవుతాయ‌ని అంటున్నారు. దాంతో ఈ మూడు జిల్లాలు భయం గుప్పిటన బతుకుతున్నాయి. పండుగ వేళ ఈ కష్టాలేంటి అని అనుకుంటున్నాయి. ఈ జిల్లాలలో వానలు ఎడతెరిపి లేకుండా కురుస్తూండడంతో మరో ఉపద్రవానికి రెడీ కావాల్సిందే అంటున్నారు అధికారులు.