ఆలు లేదు.. చూలు లేదు.. ఏపీ సీఎం బీసీ

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోతలరాయుడిలా మారిపోతున్నారు. రానురాను మరీ నమ్మశక్యంగా లేని మాటలతో ఆయన మంచి కామెడీ పండిస్తున్నారు. తాజాగా ఆయన బీసీ సీఎం అంటూ మరో హాట్ టాపిక్ ని…

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కోతలరాయుడిలా మారిపోతున్నారు. రానురాను మరీ నమ్మశక్యంగా లేని మాటలతో ఆయన మంచి కామెడీ పండిస్తున్నారు. తాజాగా ఆయన బీసీ సీఎం అంటూ మరో హాట్ టాపిక్ ని తెరపైకి తెచ్చారు. ఏపీలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేసి తీరతామని ప్రకటించారు. 

కుటుంబ పార్టీలైన వైసీపీ, టీడీపీ అలాంటిపని చేయగలవా అంటూ సవాల్ విసిరారు కూడా. రాష్ట్రం దశ, దిశ మార్చాలంటే కుటుంబ పార్టీలే అడ్డంకిగా ఉన్నాయని కూడా సెలవిచ్చారు వీర్రాజు.

పవన్ ని టార్గెట్ చేశారా..?

పవన్ కల్యాణ్ పర్యటనల్లో ఆయన అభిమానులంతా సీఎం సీఎం అంటూ సందడి చేస్తుంటారు. నమ్మడానికి కష్టంగా ఉన్నా, పవన్ కూడా వాటిని ఎంజాయ్ చేస్తుంటారనుకోండి. అదే సమయంలో వీర్రాజు, పవన్ కలసి వచ్చినా కూడా పవన్ నే సీఎం అంటూ ఉంటారు. 

ఇప్పుడు వీర్రాజు ప్రకటనని సీరియస్ గా తీసుకుంటే ఇకపై జనసేన కార్యకర్తలు అలాంటి నినాదాలు చేయకూడదు. ఒకవేళ చేశారంటే.. వీర్రాజు మాటల్ని సోదిలోకి కూడా తీసుకోనట్టే లెక్క. పవన్ సీఎం అభ్యర్థి అంటూ ఇప్పటినుంచే ప్రచారం ఎందుకా అని.. వీర్రాజు ఓ మాట అడ్డువేశారా అనే అనుమానాలు కూడా సగటు జనసైనికుల్లో ఉన్నాయి.

అప్పటికల్లా కాపుల్ని బీసీల్లో చేర్చేస్తారా..?

తెలంగాణ ఏర్పాడితే తొలి సీఎం దళితుడే అంటూ ఊదరగొట్టిన కేసీఆర్ అప్పట్లో ఏం చేశారో అందరికీ తెలుసు. అదేమని అడిగితే, దళితులలో దళితుడ్ని నేనే, గిరిజనుల్లో పెద్ద గిరిజనుడిని నేనే నంటూ భగవద్గీత శ్లోకాలు చెప్పుకొస్తారు గులాబీ బాస్. వీర్రాజు మాటలు నిజమయ్యే ఛాన్సే లేదని తెలిసినా కూడా ఆయనపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. 

బీసీని సీఎం చేస్తానంటున్న వీర్రాజు.. నిజంగానే ఆ ఛాన్స్ వస్తే కాపుల్ని బీసీల్లో కలిపేసి కాపుల్నే సీఎంగా చేస్తారని అంటున్నారు. అసలంతదాకా వస్తే బీసీలకు ఛాన్స్ ఎందుకిస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

మొత్తమ్మీద వీర్రాజు మాత్రం ఓ విచిత్ర వాదన తెరపైకి తెచ్చారు. ఆలూ లేదు, చూలూ లేదు, ఏపీ అసెంబ్లీలోకి ఎంట్రీయే లేదు కానీ.. అప్పుడే సీఎం కుర్చీ గురించి మాట్లాడి కామెడీ పీస్ గా మారిపోయారు వీర్రాజు. అందులోనూ బీసీ మంత్రం పఠించి జనసైనికుల్లో కాక రేపారు.

చంద్రబాబు వచ్చే వరకూ టీవీల్లో మాట్లాడిన పట్టాభి..

ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల