ఫలించిన జగన్ టూర్.. మండలి రద్దు ఖాయం

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి పార్లమెంట్ ఆమోద ముద్ర వేస్తుందని, ఇది లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే బడ్జెట్ పై చర్చ తప్పితే ఈ సమావేశాల్లో ఇంకే విషయంపై…

ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానానికి పార్లమెంట్ ఆమోద ముద్ర వేస్తుందని, ఇది లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే బడ్జెట్ పై చర్చ తప్పితే ఈ సమావేశాల్లో ఇంకే విషయంపై ముందడుగు పడలేదు. దీంతో.. టీడీపీ లోలోపల సంతోష పడింది. అంతలోనే జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడంతో ఏకంగా కేంద్ర కేబినెట్ లో వైసీపీ చేరబోతోందనే పుకార్లు, జగన్ రెండు దఫాలు ఢిల్లీకి వెళ్లడంతో మరిన్ని అనుమానాలు.

ఈ ఊహాగానాలు ఎలా ఉన్నా.. మండలి రద్దు, హైకోర్టు తరలింపు వంటి విషయాల్లో జగన్ కి కేంద్రం క్లారిటీ ఇచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయిన సందర్భంగా జగన్ మండలిరద్దు తీర్మానం, హైకోర్టు తరలింపు విషయాలను ప్రస్తావించారు. వెనువెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అమిత్ షా నుంచి కబురందగానే మరోసారి ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కూడా మండలి రద్దు, మూడు రాజధానుల విషయాలే కీలక అంశాలు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కర్నూలుకు హైకోర్టు తరలింపు అంశం ఉందని జగన్ గుర్తు చేయడంతో ఆయన సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. అదే రోజు ఢిల్లీ నుంచి తిరిగి రావాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో న్యాయశాఖ మంత్రి అపాయింట్ మెంట్ కుదరడం, హైకోర్టు తరలింపు, మండలి రద్దుపై ఆయన స్పష్టమైన హామీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయని చెబుతున్నారు.

బడ్జెట్ సెషన్ లో మండలి రద్దు తీర్మానానికి ఆమోద ముద్ర వేయలేకపోయామని, మార్చి 3నుంచి జరిగే రెండో దఫా సమావేశాల్లో దీన్ని ఓకే చేస్తామని రవిశంకర్ ప్రసాద్, జగన్ కు హామీ ఇచ్చారు. ఆలోగా కేంద్ర కేబినెట్ దీనికి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. దీంతో మండలి రద్దు సహా కర్నూలుకి హైకోర్టు విషయంలో కూడా పూర్తిగా క్లారిటీ వచ్చినట్టయింది.

అన్నీ అనుకున్నట్టు జరిగితే.. మార్చి 15 నుంచి జరిగే ఏపీ శాసన సభా సమావేశాల సమయానికి మండలి మూతపడుతుంది. అప్పుడు జగన్ తలపెట్టిన మూడు రాజధానుల ప్రక్రియ ఊపందుకుంటుంది.

ఏ జోనర్ చేసినా ఫ్లాపులు పలకరించాయి