మరో 2-3 రోజుల్లో ఏపీలో ప్రజా రవాణా

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ సిటీలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులు నడుస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణా ఎప్పుడు? దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు.…

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ సిటీలో తప్ప రాష్ట్రవ్యాప్తంగా సర్వీసులు నడుస్తున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రవాణా ఎప్పుడు? దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఈరోజు క్లారిటీ ఇచ్చారు. మరో 2-3 రోజుల్లో ఏపీలో ఆర్టీసీ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు.

నిజానికి మూడో దశ లాక్ డౌన్ లోనే పరిమిత సంఖ్యలో బస్సుల్ని నడపాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదముందని భావించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న నాలుగో దశ లాక్ డౌన్ లో మాత్రం ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని జగన్ స్పష్టంచేశారు.

ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉన్న కంటైన్మెంట్ ప్రాంతాల్ని టచ్ చేయకుండా బస్సుల్ని తిప్పేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో పాటు భౌతిక దూరం పాటించేలా బస్సు సీట్లను విడివిడిగా అమర్చుతున్నారు. ఇప్పటికే కొన్ని డిపోల్లో సూపర్ డీలక్స్ బస్సుల్లో ఈ ఏర్పాటు అందుబాటులోకి వచ్చింది. మరిన్ని డిపోల్లో, మరిన్ని బస్సుల్లో ఈ ఏర్పాట్లు చేసుకునేందుకు ముఖ్యమంత్రి సమయం ఇచ్చారు.

బస్సులో భౌతిక దూరంతో పాటు.. బస్సు స్టాండ్స్ లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు ప్రతి డ్రైవర్, కండెక్టర్ కు విధిగా మాస్కులు, శానిటైజర్లు ఉచితంగా అందించాలని అనుకుంటున్నారు. ఇలాంటి విధివిధానాలతో పాటు ఎన్ని బస్సులు తిప్పాలనే అంశంపై ఓ నిర్ణయానికి వచ్చిన వెంటనే ప్రజారవాణాను ప్రారంభిస్తారు.

ఈ గ్యాప్ లో తెలంగాణలో ఆర్టీసీ అనుసరిస్తున్న విధానాలు, ఫలితాల్ని అధికారులు అంచనా వేసి ఓ నిర్ణయానికి వస్తారు. కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టాలంటే ప్రజారవాణా వ్యవస్థను ప్రారంభించాల్సిందే. అందుకే జగన్ కూడా ఆర్టీసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

జన్మనిచ్చిన గడ్డపైనే కక్ష