ఏప్రిల్ నెలలో జరిగిన స్థానిక ఎన్నికలను రద్దు చేసి తిరిగి ఎన్నికలు జరపాలని హైకోర్టు సింగల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ప్రతిపక్ష పార్టీలు ఇది ప్రజాస్వామ్య విజయమని ప్రకటించాయి. విజయం ఎప్పుడు అవుతుంది. మనం చేసిన అభ్యర్థనను అంగీకరించిన్నప్పుడు మాత్రమే.
ప్రతిపక్ష పార్టీలు ఏమి కోరాయి గతంలో జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేసి తిరిగి నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. రెండు కోర్కెలను హైకోర్టు తిరస్కరించినది. ఎన్నికల ప్రకటనకు ఎన్నిక జరిగే తేదీకి మధ్య 4 వారాలు సమయం , ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేయాలని అది జరగలేదు కనుక తిరిగి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
మరో ముఖ్యమైన విషయం ప్రతిపక్ష పార్టీల డిమాండ్ ఇలా ఉంటే అధికార పార్టీ మాత్రం ఏకగ్రీవాలను అంగీకారాన్ని తెలపాలని. తిరిగి నామినేషన్లు దాఖలకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించింది.
అంతే కాదు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించవద్దు అని డివిజేన్ బెంచ్ ఆదేశాలు మేరకు ఎన్నికలు జరిగింది. ఎన్నికల కమిషన్ డివిజన్ బెంచ్ , సుప్రీంకోర్టు కు వెళ్లే అవకాశం ఉంది. అంతిమ తీర్పు ఎలా ఉంటుంది అన్నది చూడాలి. మరి హై కోర్టు తీర్పు ఎవరికి అనుకూలం ? ఎవరికి ప్రతికూలం !!