ఎలా చూసినా ఆంధ్రప్రదేశ్ చాలా బెటర్

ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వమేనంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రాల పరిస్థితి చూసినా, దేశం మొత్తమ్మీద సగటు పరిస్థితి అంచనా వేసినా ఆంధ్రప్రదేశ్ కరోనా కట్టడిలో…

ఏపీలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, దీనికి కారణం వైసీపీ ప్రభుత్వమేనంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రాల పరిస్థితి చూసినా, దేశం మొత్తమ్మీద సగటు పరిస్థితి అంచనా వేసినా ఆంధ్రప్రదేశ్ కరోనా కట్టడిలో ముందంజలో ఉన్న విషయం దాచినా దాగని సత్యం. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వ పనితీరుని ప్రశంసించకపోయినా పర్లేదు, కనీసం విమర్శలు చేయకుండా ఉండటం ప్రతిపక్షాల సంస్కారం. అయినా కూడా రాష్ట్రాన్ని నిందించడం, కేంద్రంపై ప్రశంసలు కురిపించడం టీడీపీకి అలవాటుగా మారింది. ఇలా డబుల్ గేమ్ ఆడుతున్న టీడీపీ ఈ వాస్తవాలు గమనించాలి.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 43వేలకు చేరువవుతోంది. సగటున ప్రతి రోజూ కేసుల సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. అదే సమయంలో ఏపీలో మాత్రం కేసుల సగటు నిలకడగా ఉన్నట్టు తేలింది. స్థానిక పరిస్థితులను బట్టి కొన్ని జిల్లాల్లో కేసులు పెరిగినా.. మిగతా జిల్లాల్లో మాత్రం కరోనా కట్టడిలోనే ఉంది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కొవిడ్ బారిన పడి కోలుకున్నవారి శాతం 27.52గా ఉండగా.. ఏపీలో డిశ్చార్జి అయినవారి శాతం 31.75. అంటే దాదాపు ప్రతి వందమందిలో 31మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకొని ఇఁటికెళ్తున్నారు. సగటున మిగతా రాష్ట్రాల్లో డిశ్చార్జి శాతం 20లోపే ఉండటం గమనార్హం. ఏపీలాంటి ఒకటి రెండు రాష్ట్రాల వల్లే దేశ సగటు ఆమాత్రం అయినా ఉందంటే అతిశయోక్తి కాదు.

ఇక వ్యాధిబారిన పడి చనిపోయినవారి లెక్క చూసినా దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.22గా ఉండగా.. ఏపీలో కేవలం 2శాతం మాత్రమే మరణాలు సంభవించాయి. ఏపీలో మొత్తం మరణాలు 33. వీరిలో 30మందికి వివిధ రకాల తీవ్ర అనారోగ్యాలు ఉన్నట్టు వైద్యుల నివేదికలు చెబుతున్నాయి. కేవలం కరోనా కారణంగా చనిపోయినవారు ముగ్గురంటే ముగ్గురు మాత్రమే. అంటే ఏపీలో కరోనా మరణ భయం దాదాపుగా లేనట్టే చెప్పుకోవాలి.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల శాతం 69.24గా ఉంది. ఏపీలో 66.24శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో ఉన్నారు. వీరిలో చాలామంది రెండోసారి నెగెటివ్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. టెస్ట్ రిపోర్ట్ లు వస్తే వీరు కూడా డిశ్చార్జి అయిపోతారని తెలుస్తోంది. 

అంతేకాదు కరోనా టెస్టుల్లో కూడా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంది. గడచిన 24గంటల్లో మొత్తం 10,292 శాంపిల్స్ ని టెస్ట్ చేశారు. వీటిలో కేవలం 67 మాత్రమే పాజిటివ్ వచ్చాయి. సగటున రోజుకి 10వేల టెస్ట్ లు చేస్తుండటం ఏపీకి మాత్రమే ఉన్న క్రెడిట్. ఈ గణాంకాలు చాలు ఏపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంటే.. భారత్ లో మాత్రం మనం కట్టడి చేయగలిగాం. భారత్ లో కేసుల గణాంకాలు పోల్చి చూస్తే ఏపీ పరిస్థితి మరింత బెటర్. 

సొంతంగా కరోనా వైద్యం చేయించుకుంటే ఎంత అవుతుందో తెలుసా?