నిర్భయ హంతకులకు ఉరి శిక్ష ఎట్టకేలకూ అమలయ్యింది. ఏడు సంవత్సరాల తర్వాత నిర్భయ హంతకులకు పడ్డ శిక్ష అమలైంది. అయితే ఈ శిక్ష అమలు కావడానికి సంబంధించిన పరిణామాలనూ మరవకూడదు. శంషాబాద్ లో దిశ పేరుతో ఒక అభాగ్యిణి బలైతే కానీ, నిర్భయ హంతకులు జైల్లో సేదతీరుతున్న విషయం జనాలకు, న్యాయవ్యవస్థకు గుర్తుకు రాలేదు.
దిశపై తీవ్రమైన ఘాతుకం జరిగితే.. అప్పుడు సభ్యసమాజం తీవ్రంగా స్పందిస్తే.. అప్పుడు నిర్భయ హంతకులకు శిక్ష ఎందుకు అమలు చేయలేదని పోలీసులపై, కోర్టులపై ప్రెజర్ పెరిగింది. దీంతో శిక్షను అమలు చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఒకవేళ దిశ పై ఘాతుకానికి ప్రచారం రాకపోతే.. నిర్భయ హంతకులు తీహార్ జైల్లో కరోనా వైరస్ సోకుండా జాగ్రత్తలు తీసుకునే వాళ్లేమో!
అయితే నిర్భయ హంతకులకు శిక్ష అమలు అనంతరం కూడా.. ఆ హంతకుల తరఫు న్యాయవాది ఎపి సింగ్ దారుణమైన మాటలే మాట్లాడాడు. నిర్భయ క్యారెక్టర్ ను తప్పు పట్టాడు ఈ నీఛుడు. 'అర్ధరాత్రి పూట అమ్మాయికి ఏం పని..' అంటూ ఈ లాయర్ తన థర్డ్ గ్రేడ్, చీప్ మెంటాలిటీని చాటుకున్నాడు. అర్ధరాత్రి అమ్మాయి బయటకు వస్తే.. కిరాతకంగా రేప్ చేయాలా? అలాంటి కిరాతకులను కుటిల ప్రయత్నాలతో రక్షించడానికేనా లా చదివింది? ఈ ప్రశ్నలను ఈ కిరాతక లాయర్ ను ఎందుకు అడగలేదో అక్కడే ఉన్న జర్నలిస్టులు.
ఈ లాయర్ స్పందన చూస్తుంటే.. వీడు ఆ నిర్భయ హంతకుల కన్నా కిరాతకుడిలా ఉన్నాడు. ఆఖరి వరకూ వేసిన పిటిషన్లు, వినిపించిన వాదనల్లో ఎక్కడా పశ్చాతాపం లేదు. ఎంతసేపూ బయటకు వచ్చిన ఆ అమ్మాయి తప్పు అంటాడే కానీ, తన క్లైంట్లు తప్పు చేశారని, మానవతాదృక్పథంతో క్షమించాలని కూడా ఈ లాయర్ వాదించినట్టుగా లేరు. ఘాతుకానికి బలైన ఆ అమ్మాయిదే తప్పంటూ వాదించి.. వారికి ఉరి మరింత గట్టిగా బిగుసుకునేలా చేసినట్టుగా ఉన్నాడు ఈ లాయర్.
ఆ అమ్మాయి ప్రియుడితో కలిసి వీళ్లను రెచ్చగొట్టిందని కూడా ఈ లాయర్ ఏవో ఇంటర్వ్యూల్లో పనికిమాలిన మాటలు మాట్లాడాడు. నిర్భయ హంతకులను రక్షించడానికి ఈ థర్డ్ గ్రేడ్ లాయర్ చేసిన ప్రయత్నాలను, ఆఖరికి ఓడిపోయాకా స్పందించిన తీరును గమనిస్తే.. ఇతడిపైనా నిర్భయ యాక్ట్ ను అమలు చేయాలి పోలీసులు. ఈ కారుకూతలు, పనికిమాలిన మాటలు మాట్లాడినందుకు తీహార్ కే పంపాలి.
గమనించాల్సింది ఏమిటంటే.. ఆ కిరాతకులు నిర్భయపై అత్యాచారం చేసి, తమ కామ వాంఛను తీర్చుకుని వదిలి వేయలేదు. ప్రస్తావించక తప్పని అంశాలు ఏమిటంటే.. ఆమె అవయవాళ్లోకి స్క్రూడ్రైవర్లు, రెంచ్ లను పొడిచి, మాటల్లో చెప్పడానికి సాధ్యం కానంత దారుణంగా ప్రవర్తించారు. వాళ్లది కామవాంఛ మాత్రమే కాదు, రాక్షసులు కూడా అంత దారుణంగా ప్రవర్తించరేమో. అలాంటి వాళ్లను ఇంకా వెనకేసుకు వస్తూ.. ఈ లాయర్ మరింత రాక్షసుడిలా ప్రవర్తిస్తూ ఉన్నాడు.