987 కేసులు.. 24 మరణాలు

ఇండియాలో కరోనా కేసులు గంటగంటకు పెరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 987కు చేరింది. దేశవ్యాప్తంగా 24 మరణాలు చోటుచేసుకున్నాయి. 84 మంది కోలుకున్నారు. Advertisement…

ఇండియాలో కరోనా కేసులు గంటగంటకు పెరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 9 గంటల సమయానికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 987కు చేరింది. దేశవ్యాప్తంగా 24 మరణాలు చోటుచేసుకున్నాయి. 84 మంది కోలుకున్నారు.

తెలంగాణలో నిన్న తొలిసారిగా కరోనా మరణం సంభవించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కరోనా కేసుల సంఖ్య పెరగడంతో.. ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. మరింత కఠినంగా నిబంధనల్ని విధించింది. రైతు బజార్లను విభజించడంతో పాటు.. మరింత మంది జనాలు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు స్విగ్గి, బిగ్ బాస్కెట్ ద్వారా పాలు సరఫరా చేయాలని నిర్ణయించింది.

అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఊహించని విధంగా కరోనా పాజిటివ్స్ సంఖ్య పెరిగిపోయింది. ఒకేసారి ఊహించని విధంగా సంఖ్య 19కి చేరింది. శనివారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది జగన్ సర్కార్.

ఇక ఇవాళ్టి నుంచి ఇవ్వబోతున్న రేషన్ లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోబోతోంది ప్రభుత్వం. గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా సరుకుల్ని ఇంటికి చేరవేయడంతో పాటు.. వేలిముద్ర నుంచి మినహాయింపు ఇచ్చింది. రేషన్ తీసుకునే వ్యక్తి బదులు వీఆర్వో తన వేలిముద్ర వేస్తాడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఈరోజు ఉదయం నాటికి 6,64,600కు చేరింది. 30వేల 846 మంది చనిపోగా.. 1,40,156 మంది కోలుకున్నారు. ప్రతి దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగడం శుభపరిణామం.

మేము సైతం

ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమ‌లు చేస్తాం