Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమా కార్మికులకు సరుకులు

సినిమా కార్మికులకు సరుకులు

మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలో ఎన్ శంకర్, తమ్మారెడ్డి భరద్వాజ తదితరుల మేనేజ్ మెంట్ తో ఏర్పాటయిన సిసిసి ఫండ్ విధి విదానాలు తయారవుతున్నాయి. ఒకటవ తేదీ లోగా సినిమా రంగంలోని 24 క్రాఫ్ట్ ల్లోని కార్మికులకు సరుకులు అందించడానికి ఈ కమిటీ ఏర్పాట్లు ప్రారంభించింది. ముందుగా 24 క్రాప్ట్ ల యూనియన్ లను అవసరమైన వారి జాబితా తయారుచేసి ఇవ్వమని కోరారు. ఆ మేరకు జాబితాలు వచ్చాయి.

అదే సమయంలో ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబానికి నెల రోజులకు ఏ మేరకు సరుకులు అవసరం అన్నది ఓ జాబితా రూపొందించారు. ఈ జాబితా ప్రకారం సరుకులు ఎవరు సరఫరా చేస్తారు? ఎలా సరఫరా చేస్తారు? కర్ఫ్యూ నిబంధనలు వున్న ఈ రోజుల్లో వాటిని ఎలా పంపిణీ చేయాలి? అన్న విషయాలు చాక్ అవుట్ చేస్తున్నారు. 

ఈ మేరకు అవసరం అయితే ప్రభుత్వం నుంచి, పోలీసు శాఖ  నుంచి అనుమతుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ కుటుంబానికి నెలకు కావాల్సిన సరుకుల జాబితా తయారు చేస్తే, దానికి కనీసం మూడు వేల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇలా అందించాల్సిన సరుకులు అందుకునేవారి జాబితా కనీసం వెయ్యి మంది వరకు వుంటారని భావిస్తున్నారు.

పెర్మనెంట్ ఎంప్లాయీస్, నెల వారీ జీతాలు తీసుకునేవారిని మినహాయిుస్తున్నారు. డ్యూటీకి వెళ్లకుంటే డబ్బులు రాని వారినే జాబితాలో చేర్చాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి థియేటర్ల వర్కర్ల గురించి ఆలోచించలేదు. సినిమా పరిశ్రమ వరకు ఆలోచిస్తున్నారు. 

సిసిసి ఇవ్వబోయే సరుకుల జాబితా ఇలా వుంటుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?