వినీల యడ్లపల్లి. ఈ పేరు మామూలు జనాలకు అంతగా పరిచయం కాదు కానీ జూబ్లీ హిల్స్ పేజ్ త్రీ సర్కిల్ కు బాగానే పరిచయం. యుఎస్ నుంచి వచ్చి, వైవిధ్యమైన కేక్ షాప్ ను ప్రారంభించి, తక్కువ టైమ్ లోనే ఎక్కువ పాపులారిటీ సాధించిన వ్యక్తి. సినిమా, బిజినెస్ సెలబ్రిటీలకు వైవిధ్యమైన కస్టమైజ్డ్ కేక్ లు తయారుచేయడంలో పేరు సంపాదించారు.
అయితే పేరు మాత్రమే కాదు, కార్పొరేట్ రెస్పాన్స్ బిలిటీ కూడా వుండాలి అనే దృక్పథంతో అవసరం అయినపుడల్లా, అవసరం అయిన వారికి సాయం చేసుకంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య కరోనా. ఈ సమస్యను ఎదుర్కోవడానికి ప్రతి రాష్ట్రం, ప్రతి దేశం, ప్రతి ఒక్కరు తమ వంతు కృషి చేస్తున్నారు.
అందుకే వినీల యడ్లపల్లి కేక్ షాప్ నుంచి కూడా తమ వంతు సాయం అందించాలని, తెలంగాణ ప్రభుత్వానికి అయిదులక్షలు అందించారు. కరోనా నివారణకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు చేసే ఖర్చులో ఈ మొత్తాన్ని కూడా జోడించాలని కోరారు. ఓ కేక్ షాప్ నుంచి ఈ రేంజ్ డొనేషన్ అందించడం అన్నది నిజంగా మెచ్చుకోదగ్గ విషయమే.