అదే చంద్రబాబు మార్క్ పాలిటిక్స్ … ?

చంద్రబాబు ఈ రోజూ నిన్నా రాజకీయాల్లో లేరు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ ఇండస్ట్రీ. ఆయన ఎత్తులు వ్యూహాలూ కూడా అందరికీ గతంలో తెలియకపోయినా ఇపుడున్న టెక్నాలజీ యుగంలో ఈజీగా అర్ధమైపోతున్నాయి.…

చంద్రబాబు ఈ రోజూ నిన్నా రాజకీయాల్లో లేరు. ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లుగా ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్ ఇండస్ట్రీ. ఆయన ఎత్తులు వ్యూహాలూ కూడా అందరికీ గతంలో తెలియకపోయినా ఇపుడున్న టెక్నాలజీ యుగంలో ఈజీగా అర్ధమైపోతున్నాయి.

అయితే చంద్రబాబు మాత్రం తాను నమ్ముకున్న రాజకీయాన్ ఎపుడూ నే చేస్తారని చెబుతారు. ఇవన్నీ పక్కన పెడితే బాబు ఫక్తు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు అంటున్నారు వైసీపీ మంత్రి సీదరి అప్పలరాజు. చంద్రబాబు ఈ విషయంలొ బాగా ఆరితేరిపోయారు అని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీకి పాజిటివిటీ ఏ మాత్రం పెరగకుండా ఎప్పటికపుడు తన అనుకూల మీడియాను అడ్డు పెట్టుకుని బాబు చేయాల్సింది అంతా చేస్తారు అని అప్పలరాజు ఆరోపిస్తున్నారు. రీసెంట్ గా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ కనీ వినీ ఎరగని మెజారిటీతో గెలిచింది. ఒక ఉప ఎన్నిక అందునా రెండున్నరేళ్ల తరువాత జరిగిన ఎన్నికలో ఏకంగా తొంబై వేల పై చిలుకు ఓట్ల మెజారిటీ అధికార పార్టీకి రావడం అంటే మామూలు విషయం కాదని మంత్రి అంటున్నారు.

అయితే చంద్రబాబు ఆయన అనుకూల మీడియా మాత్రం దీన్ని దైవర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పాదయాత్ర ఇష్యూని తెర ముందుకు తీసుకువచ్చారని ఆయన విమర్శించారు. దాని కంటే ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో ఉక్కు కార్మికులకు మద్దతు అంటూ మీటింగ్ పెట్టడం కూడా బాబు మార్క్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అని మంత్రి అంటున్నారు. అంటే ఏపీలో సంక్షేమ పధకాల గురించి వైసీపీని జనం ఆదరిస్తున్న తీరు గురించి ఎక్కడా చర్చ సాగకుండా చేయడానికే ఇదంతా అంటూ మండిపడ్డారు మంత్రి గారు.

మొత్తానికి బాబు ఇలా ఎపుడూ చేస్తూనే ఉంటారని, అయినా వైసీపీ గురించి తెలిసిన జనాలు మాత్రం తమకే మద్దతుగా ఉంటారు అనడానికే బద్వేల్ ఘన విజయం అని మంత్రి చెబుతున్నారు. మొత్తానికి బాబు మార్క్ పాలిటిక్స్ మీద వైసీపీకి మంచి అవగాహన ఉన్నట్లుంది. అయితే అది చాలదేమో, దాన్ని ఎలా తిప్పుకొట్టాలో తెలిస్తే కదా రాజకీయ సమరంలో నెగ్గి ముందుకు అడుగులు వేసినట్లు. చూడాలి మరి దీని మీద వైసీపీ ఎదురు వ్యూహాలు ఎలా ఉంటాయో.