తాము దోపిడీ చేయడం మొదలుపెడితే.. ఆ దోపిడీలో ఫర్నీచర్లను, పేపర్లను కూడా వదిలే టైపుకాదని తెలుగుదేశం పార్టీ వాళ్లు స్వయంగా చెబుతూ ఉన్నారు. తీరా దొరికిపోయాకా ఏదో ఊరికే తీసుకెళ్లాం అన్నట్టుగా వాళ్లు కలరింగ్ ఇస్తున్నారు. అసెంబ్లీ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి ఫర్నీచర్లను తరలించారంటే ఈ దోపిడీకి ఎంత పక్కాగా ప్రణాళిక రచించారో అర్థం చేసుకోవచ్చు.
వాళ్లకు దోపిడీలు కొత్త కాదు అనే విషయం స్పష్టం అవుతూనే ఉంది. వారుచేసిన దోపిడీల గురించి అనేకమంది పోలిస్ స్టేషన్ లకు ఎక్కుతున్నారు. సొంత కులం వారు, తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమానులే వారు చేసిన దోపిడీల గురించి స్టేషన్లకు ఎక్కి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఆఖరికి అసెంబ్లీలో ఫర్నీచర్లు, పేపర్లను దోచుకునేంత స్థాయి కక్కుర్తి తమ సొంతం అని వారు నిరూపించుకున్నారు.
ఇప్పుడు దొరికిపోయాకా వాటిని తిరిగి ఇవ్వడానికి రెడీ అంటున్నారట. అసెంబ్లీ సీసీ కెమెరాలను సైతం ఆఫ్ చేసి దోచుకెళ్లిన ఘనులు ఇప్పుడు ఏమైనా మాట్లాడగలరు! గౌరవనీయమైన పదవుల్లో ఉండి ఆఖరికి ఇంత కక్కుర్తికి పాల్పడటం మాత్రం తెలుగుదేశం ఇమేజ్ ను చాలా దారుణంగా డ్యామేజ్ చేస్తూ ఉంది.
దొరికిపోతామనే భయం లేకుండా లక్షల రూపాయల విలువ చేసే వాటిని కూడా దోచుకెళ్లిన ఘునులు ఇంకా ఏ స్థాయిలో ఎంత దోపిడీ చేసి ఉంటారో అర్థం చేసుకోవడం పెద్ద విషయం కూడా కాదని ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు. ఇంత చిల్లర దొంగతనాలకు కూడా వెనుకాడని బ్యాచ్ తెలుగుదేశం పార్టీలో ముఖ్యనేతలుగా చలామణి అవుతున్న వైనంపై ప్రజల్లో చర్చ జరుగుతూ ఉంది.