'క్వీన్' తమిళ రీమేక్ లో హాట్ సీన్లు ఆ సినిమా ట్రైలర్ విడుదల అప్పుడే చర్చనీయాంశంగా నిలిచాయి. ఆల్మోస్ట్ అసభ్యంగా ఉన్న ఆ సీన్లను చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అడాల్ట్ రేటెడ్ సినిమాల్లో కూడా అలాంటి సీన్లు ఉండవు. అయితే ట్రైలర్ లో చూపించినవి కేవలం మచ్చుకేనేని, ఆ సినిమా ఇంకా చాలా ఉన్నాయని సెన్సార్ దగ్గర బయటపడిందని తెలుస్తోంది. అసభ్య సంభాషణలు, సీన్లను మొత్తం కత్తిరించేసిందట సెన్సార్ బోర్డు.
ఈ విషయంలో నిర్మాతలు అభ్యంతరం తెలపడంతో ఆ కత్తిరింపులపై మళ్లీ సమీక్ష జరుగుతూ ఉంది. క్వీన్ సౌత్ లోని అన్ని భాషల్లోనూ రీమేక్ అయ్యింది. తెలుగు, మలయాళ, కన్నడ వెర్షన్ల విషయంలో రాని అభ్యంతరాలు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళం విషయంలోనే వచ్చాయి. హీరోయిన్ గా అవకాశాలు తగ్గుముఖం పడుతుండటంతో అలాంటి సీన్లను ఉత్సాహంగా నటించినట్టుంది కాజల్ అగర్వాల్.
ఇక ప్రస్తుతం ఆ సెన్సార్ వివాదం నడుస్తూ ఉండగా… ఈ అంశంపై కాజల్ అగర్వాల్ స్పందించింది. అలా సీన్లను కత్తిరించడం తనను చాలా అసంతృప్తికి గురి చేసిందని కాజల్ అంటోంది. అలా జరిగి ఉండాల్సింది కాదని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది.
తాము ఎంతో కష్టపడి ఆ సినిమాను చేసినట్టుగా, ఒరిజినల్ లో ఉన్న సీన్లనే తీసినట్టుగా కాజల్ చెబుతూ ఉంది. అలాంటిది తమ సినిమా విషయంలో సెన్సార్ కత్తెరకు పదును పెరగడం పట్ల కాజల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మరి అదే క్వీన్ ను అదే నిర్మాతలు ఇతర భాషల్లోనూ రీమేక్ చేశారు. వాటి విషయంలో రాని అభ్యంతరాలు తను నటించిన వెర్షన్లోనే ఎందుకు వస్తున్నాయో కాజల్ కు అర్థంకావడం లేదేమో!