Advertisement

Advertisement


Home > Movies - Movie News

హమ్మయ్య.. అజ్ఞాతం వీడిన రాజ్ తరుణ్

హమ్మయ్య.. అజ్ఞాతం వీడిన రాజ్ తరుణ్

షాక్ లోకి వెళ్లాడా లేక రిస్క్ ఎందుకని బయటకు రాలేదా లేక పోలీసులకు భయపడ్డాడా.. కారణం ఏదైతేనేం.. మొత్తానికి యాక్సిడెంట్ జరిగిన 24 గంటల తర్వాత అజ్ఞాతం వీడి బయటకొచ్చాడు రాజ్ తరుణ్. అది కూడా మీడియా ముందుకు కాదు, సోషల్ మీడియాలోకి వచ్చాడు. అవును.. తను సేఫ్ అంటూ ట్వీటాడు ఈ కుర్రహీరో.

"రింగ్ రోడ్డుపై సడెన్ గా రైట్ తీసుకోవాల్సి వచ్చింది. తొందరగా నిర్ణయం తీసుకోవడంతో కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గోడను ఢీకొట్టింది. ఆ శబ్దానికి నా చెవులు బ్లాక్ అయ్యాయి, కళ్లు బైర్లు కమ్మాయి. హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగి ఏం చేయాలో అర్థంకాలేదు. సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. నన్ను నేను ఒక్కసారి చెక్ చేసుకున్నాను, వెంటనే సహాయం కోసం అక్కడ్నుంచి ఇంటికి వెళ్లిపోయాను."

యాక్సిడెంట్ స్పాట్ నుంచి రాజ్ తరుణ్ కావాలనే పరారయ్యాడంటూ వస్తున్న ఊహాగానాలకు ఇలా తన ట్వీట్ తో చెక్ పెట్టాడు రాజ్ తరుణ్. నార్సింగ్ సర్కిల్ వద్ద ఉండే ఆ స్పాట్ లో 3 నెలలుగా తరచుగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయన్న రాజ్ తరుణ్.. తన గురించి కంగారుపడుతూ కాల్స్ చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు.

రాజ్ తరుణ్ నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో కొన్ని మీడియా సంస్థలు తరుణ్ అని భ్రమపడి వార్తలు ప్రసారం చేశాయి. దీనిపై తరుణ్ క్లారిటీ ఇవ్వడంతో రాజ్ తరుణ్ అని నిర్థారణ అయింది. మరోవైపు దగ్గర్లోని సీసీ టీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాక్సిడెంట్ అయిన వెంటనే రాజ్ తరుణ్ ఆ స్పాట్ నుంచి పరుగెడుతున్న విజువల్స్ పోలీసుల వద్ద ఉన్నాయి.

తను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ప్రకటించిన రాజ్ తరుణ్, మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వచ్చేస్తానని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో దిల్ రాజు, సురేష్ బాబు బ్యానర్లపై చెరో సినిమా చేస్తున్నాడు.

'బాహుబలి' ఇంకా కలగానే ఉంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?