నీతి, నిజాయితీ.. అచ్చెన్న ప్రవచనాలు

నీతిగా ఉన్నందుకే నన్ను అరెస్ట్ చేశారు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారంటూ బెయిలుపై విడుదలైన రెండు రోజుల తర్వాత ట్వీటారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. నీతి, నిజాయితీ గురించి అచ్చెన్నే చెప్పాలి…

నీతిగా ఉన్నందుకే నన్ను అరెస్ట్ చేశారు, ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే అక్రమ కేసులు పెట్టారంటూ బెయిలుపై విడుదలైన రెండు రోజుల తర్వాత ట్వీటారు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు. నీతి, నిజాయితీ గురించి అచ్చెన్నే చెప్పాలి మరి. ప్రభుత్వం కక్ష సాధిస్తోందంటో మరో ఏడుపు దీనికి అదనం. ఏడాదిలో ప్రభుత్వం ఏ తప్పు చేసిందని అచ్చెన్న నిలదీశారు, ఎక్కడ అవినీతి జరిగిందని ఆయన ప్రశ్నించారు.

అసలు ఆయన్ని అరెస్ట్ చేసింది ఈఎస్ఐ మందుల కుంభకోణంలోనా లేక, సర్కారుపై లేనిపోని మాటలతో తూలనాడినందుకా? మొత్తమ్మీద బైటకు రాగానే సింపతి కోసం డ్రామాలు ఆడటం మొదలు పెట్టారు అచ్చెన్నాయుడు. అందులోనూ చంద్రబాబు కలసి వెళ్లిన తర్వాత సడన్ గా ట్విట్టర్ పాస్ వర్డ్ గుర్తొచ్చింది కాబోలు, ప్రభుత్వం, కక్షసాధింపు అంటూ ఓ ట్వీట్ వేశారు.

అంతా బాగానే ఉంది కానీ, అసలు ఈఎస్ఐలో జరిగిన కుంభకోణం ఏంటి? ఎందుకు ఆయన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారనే విషయం మాత్రం బైటకు చెప్పుకోలేకపోయారు. అంత నిజాయితీపరుడైతే ఈఎస్ఐ వ్యవహరంలో ఏం జరిగిందో కనీసం ప్రజలకు చెప్పుకోవాలి కదా? తాను కడిగిన ముత్యం అంటూ బైటకొచ్చిన తర్వాత ప్రగల్భాలు పలకాలి కదా? అవేవీ చేయకుండా నీతి, నిజాయితీ అంటూ తనకు సంబంధం లేని పదాలు వాడారు అచ్చెన్నాయుడు.

23 మంది ఎమ్మెల్యేలతో సగం చచ్చిన టీడీపీని పూర్తిగా చంపాల్సిన అవసరం అసలు వైసీపీకి ఉందా? ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలనుకుంటే ముందు చంద్రబాబు, లోకేష్ అరెస్ట్ అయి ఉండేవారు కదా? సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తపడ్డారు, సైడ్ క్యారెక్టర్లను ఇరికించారు కాబట్టే, అచ్చెన్నాయుడు లాంటివారు బలిపశువులవుతున్నారు.

అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే.. అచ్చెన్నాయుడు బీసీ కార్డుని వదిలేయడం. బీసీ కావడం వల్లే, బీసీ నేతలపై కక్షసాధించాలనుకోవడం వల్లే అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేశారని చంద్రబాబు అండ్ కో చేసిన రాద్ధాంతం ఎవరూ మరచిపోలేదు. ఆ బీసీ రాజకీయం దారుణంగా ఫెయిల్ కావడం వల్లే, ఇక దాన్ని ప్రస్తావించడం లేదు టీడీపీ. అందుకే అచ్చెన్న ట్వీట్ లో కూడా ఎక్కడా బీసీ అనే పదం వాడలేదు. అదీ సంగతి.

ప్రస్తుతం ఒక ట్రాప్ లో ఉన్నాను