సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్ బ్రాండ్ రాజకీయం 2020 కి సూట్ కాదేమోనని పెద్ద డౌట్. ఆయన ఎయిటీస్ లో హీరో లెవెల్లో దూకుడు రాజకీయం చేసేవారు. అప్పట్లో యువకుడు కాబట్టి తప్పు అయినా వయసు ప్రభావం అని సర్దిపుచ్చుకునేవారు.
కానీ ఇపుడు షష్టి పూర్తి వయసు దాటేసి మనవల తండ్రి అయ్యాక కూడా అదే దూకుడుతో చెడుగుడు ఆడతాను అంటే ఆయన హుందాతనానికే అది దెబ్బ అవుతుందంటున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడితే ఒక లెక్కలో ఉండాలి.
కానీ ఆయన మాత్రం మీడియా ముందుకొస్తే చాలు రెచ్చిపోతున్నారు. అధికారం పోయిన బాధ ఓవైపు వైసీపీ మీద పీకల్లోతు కోపం మరో వైపు. ఇవన్నీ కలసి ఆయన ఏం మాట్లాడుతున్నారో కూడా అర్ధం కావడంలేదంటున్నారు.
తాజాగా గీతం విద్యా సంస్థలు అక్రమ కట్టడాలను అధికారులు కూల్చిన దానిపైన అయ్యన్న చేసిన విమర్శల కంటే ఆయన నోటి వెంట జాలువారిన ఆణిముత్యాలే హైలెట్ అయ్యాయి. ఆయన అధికారుల తీరు మీద మండిపడడంతో సరిపుచ్చలేదు. వాడకూడని భాషను వాడేశారని అంటున్నారు.
మరీ ఇంతలా కోపం కట్టలు తెంచుకుంటే ఎలా అయ్యన్నా అని అంతా అంటున్నారంటే పెద్దాయన కాస్త జాగ్రత్త పడాలేమో. కానీ టైం లో కాస్తా తగ్గి ఉండాలన్నది తెలియకపోతే ఎలా మరి.