విశాఖలో నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై కోడి కత్తితో శీను అనే యువకుడు దాడి చేసిన కొన్ని నిమిషాల్లోనే…అప్పటి చంద్రబాబు ఏం చేశారో గుర్తుందా? ఆ ఘటను ఖండించకపోగా…బాధితుడైన జగన్‌పై ఎదురు దాడికి దిగాడు. సభ్య సమాజం తలదించుకునేలా నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడాడు. జగన్‌పై కోడి కత్తితో దాడి చేసింది ఆయన వీరాభిమానే అని చిత్రీకరించేందుకు యత్నించాడు. అంతే కాదు జగనే తనపై దాడి చేయించుకున్నాడని ఆరోపణలు చేశాడు.
అంతటితో ఆయన ఆగలేదు. అప్పట్లో సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ జగన్ ఫొటో పక్కన తన ఫొటో పెట్టి ఫ్లెక్సీ కట్టాడంటూ…ఓ తాజా ఫ్లెక్సీని కూడా అప్పట్లో చంద్రబాబు ప్రదర్శించాడు. అలాగే నిందితుడి వద్ద కనీసం మడతలు పడని లేఖను కూడా స్వాధీనం చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశలయ్యాయి.
తాజాగా బీసీ రిజర్వేషన్లపై కూడా బాబు సరికొత్త వాదన ముందుకు తెచ్చాడు. చంద్రబాబు మంగళవారం విలేకరుల ముందుకు వచ్చాడు. స్థానిక ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్లపై ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ కేసులు వేసిన బోయ రామాంజనేయులు…రాప్తాడు వైసీపీ మండల కన్వీనర్‌గా ప్రజలకు దసరా, దీపావళి శుభాకాంక్షలు చెబుతూ వేయించిన ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అలాగే జగన్‌తో రామాంజనేయులు వ్యక్తిగతంగా కలిసిన ఫొటోను కూడా బాబు ప్రదర్శించాడు.
మరో పిటిషనర్ బిర్రు ప్రతాప్‌రెడ్డి …వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌తో ఉన్న ఫొటోలను కూడా బాబు ప్రదర్శించాడు. అలాగే మంత్రి బొత్స సత్యనారాయణతో ప్రతాప్‌రెడ్డి ఫోటోలు దిగారని చెప్పాడు. జగన్‌ను హత్యాయత్నం చేసిన నిందితుడినే ఆయన అభిమానిగా చిత్రీకరించిన చంద్రబాబుకు…బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆయన ప్రదర్శించిన ఫ్లెక్సీలు ఇంకెంత భూటకమో ఆంధ్రా ప్రజానీకానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎందుకంటే తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగల సమర్థుడు చంద్రబాబు అనే విషయం అందరికీ తెలుసు. అధికారంతో పాటు రాజకీయాల కోసం ఏ స్థాయికైనా దిగజారగల, ఎవరినైనా ఏమైనా చేయడానికి వెనుకాడని మనస్తతత్వం చంద్రబాబుదని రాష్ట్ర ప్రజానికానికి బాగా తెలుసు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో ఎలాంటి గతి పట్టించారో కళ్లకు కట్టినట్టు ఉంది. అలాంటిది బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లింది జగన్ మనుషులే అని బాబు చెప్పినంత మాత్రానా నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు.