నవరత్నాల్లో ఏ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించినా.. అదే రోజు రాష్ట్రంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం, నిరసనలు తెలియజేయడం చంద్రబాబు అండ్ బ్యాచ్ కి అలవాటైంది. అమరావతి ఆందోళనల్లో పాల్గొనడం, భిక్షాటన మొదలు పెట్టడం.. ఇలాంటి కుటిల తంత్రాల్లో భాగంగానే జరిగాయి. జగన్ పథకాలపై ప్రజల్లో చర్చ జరక్కుండా ఇలా డైవర్షన్ గేమ్ మొదలు పెడతారు బాబు.
అతడి అనుకూల మీడియా ఎలాగూ ఈ అందోళనల్నే హైలెట్ చేస్తుంది కాబట్టి జగన్, ఆయన ప్రవేశపెట్టే పథకాలు ఫోకస్ కావు. ఇప్పటి వరకూ ఇలాంటి చావు తెలివితేటలే ప్రదర్శించారు బాబు. తాజాగా జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని విజయనగరం కేంద్రంగా జగన్ ప్రారంభించే సమయంలో కూడా చంద్రబాబు డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. రెండో విడత ప్రజా చైతన్య యాత్రను సరిగ్గా అదేరోజు మొదలు పెట్టారు.
అన్న క్యాంటీన్లు ఆపేశారంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు చంద్రబాబు. తొలివిడత ప్రజా చైతన్య యాత్ర ఫలితం చేదుగా తగిలినా.. కేవలం విద్యాదీవెన పథకం ప్రారంభిస్తున్నారనే దుగ్ధతోనే.. మలివిడత కుప్పంలో మొదలుపెట్టారు బాబు. అన్నక్యాంటీన్ల మూసివేత పూర్తిగా పాతపడిపోయిన సబ్జెక్ట్. క్యాంటీన్లన్నీ ఇప్పుడు సచివాలయాలుగా మారిపోయాయి కూడా. అయినా ఇప్పుడీ రాద్ధాతం ఎందుకు? ఎందుకంటే సీఎం కొత్త పథకాన్ని ప్రారంభించారు కాబట్టి.
ఇలా ఏదో ఒక డైవర్షన్ గేమ్ ఆడటం చంద్రబాబుకి అలవాటుగా మారింది. అందుకే అవసరం ఉన్నా లేకున్నా.. జగన్ కొత్త పథకం ప్రారంభించే రోజునే చంద్రబాబు ఇలా కొత్త నాటకానికి తెరతీస్తున్నారు. ఇంత చేసినా చంద్రబాబు ఏం బావుకుంటారు. కేవలం తన అనుకూల మీడియాలో తన బొమ్మ చూపించుకోవడం తప్ప. ఇలాంటి అల్ప సంతోషి కాబట్టే.. గత ఎన్నికల్లో బొక్కబోర్లాపడ్డారు.