హిట్ సెన్సారు చెన్నయ్ లో

చాలా కాలం తరువాత ఓ తెలుగు సినిమా సెన్సారు చెన్నయ్ లో జరిగింది.  సాధారణంగా తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేసినా, సెన్సారు చెన్నయ్ లోనే అన్నీ కలిపి ఒకేసారి చేసేస్తారు. కానీ తెలుగు…

చాలా కాలం తరువాత ఓ తెలుగు సినిమా సెన్సారు చెన్నయ్ లో జరిగింది.  సాధారణంగా తమిళ సినిమాలు తెలుగులో డబ్ చేసినా, సెన్సారు చెన్నయ్ లోనే అన్నీ కలిపి ఒకేసారి చేసేస్తారు. కానీ తెలుగు సినిమాలు ఇక్కడే హైదరాబాద్ లో జరుగుతాయి. అయితే ఇటీవల సెన్సారు ఆఫీసర్ మారారు. ఇంతకు ముందు వున్న అధికారి రిటైర్డ్ అయ్యారు. కొత్తగా చెన్నయ్ నుంచి మహిళా అధికారి వచ్చి చేరారు.

కానీ ఆమె ఇంకా పూర్తిగా ఇక్కడ సెటిల్ కాలేదు. ఇలాంటి టైమ్ లో హిట్ సినిమా అర్జెంట్ గా  నిర్మాతల కోరిక మేరకు  సెన్సారు చేయాల్సి వచ్చింది. దాంతో చెన్నయ్ వచ్చేస్తే చేసేస్తానని చెప్పినట్లు బోగట్టా. ఆ మేరకు నిన్నటికి నిన్న చెన్నయ్ లో సెన్సారు చేయించేసారు. 

అయితే థ్రిల్లర్ సినిమా కాబట్టి, కాస్త గట్టిగానే కట్ లు చెప్పినట్లు తెలుస్తోంది. అవన్నీ నైట్ కు నైట్ సెట్ చేసి సర్టిఫికెట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. హీరో నాని నిర్మించి ఈ సినిమాలో విశ్వక్ సేన్ కీలకపాత్రలో నటించాడు. ఈ నెల 28న విడుదలవుతోందీ సినిమా.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?