బాబుకు పోయేకాలం…బీసీల‌పై మామూలు కుట్ర కాదు!

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా తుడిచిపెట్టుకు పోయే కాలం ద‌గ్గ‌రికొచ్చిన‌ట్టుంది. టీడీపీకి ఎన్నో ఏళ్ల‌గా అండ‌గా ఉన్న బీసీల‌పై ఆయ‌న భారీ కుట్ర‌కు తెర‌లేపార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను బ‌ద్నాం చేసేందుకు స‌స్పెం…

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు రాజ‌కీయంగా తుడిచిపెట్టుకు పోయే కాలం ద‌గ్గ‌రికొచ్చిన‌ట్టుంది. టీడీపీకి ఎన్నో ఏళ్ల‌గా అండ‌గా ఉన్న బీసీల‌పై ఆయ‌న భారీ కుట్ర‌కు తెర‌లేపార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను బ‌ద్నాం చేసేందుకు స‌స్పెం డ్‌కు గురైన జిల్లా జ‌డ్జి రామ‌కృష్ణ‌తో ఓ ప‌థ‌కం ప్ర‌కారం ఫోన్ చేయించి ఇరికించాల‌నే ప్ర‌య‌త్నాల‌పై బీసీలు భ‌గ్గుమంటున్నారు.

హైకోర్టు మాజీ న్యాయ‌మూర్తి, అఖిల భారత బీసీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నత విద్య నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య మీద టీడీపీ పెద్ద స్థాయిలోనే కుట్ర‌కు పాల్ప‌డి, త‌న సామాజిక వ‌ర్గ మీడియా ద్వారా మ‌రో ర‌కంగా ప్ర‌చారానికి ఒడిగ‌ట్టాడ‌ని బాబుపై బీసీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

బీసీల‌కు అండ‌గా నిలిచిన జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌ను బ‌లి చేసేందుకు ద‌ళిత జడ్జి రామకృష్ణను పావుగా వాడుకున్నార‌ని బీసీలు మండిప‌డుతున్నారు.

అయితే టీడీపీ ఆవిర్భావం నుంచి అండ‌గా ఉంటున్నందుకు చంద్ర‌బాబు త‌మ‌కు త‌గిన రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చార‌ని బీసీలు వ్యంగ్యంగా అంటున్నారు.

న్యాయం కోసం జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌కు రామ‌కృష్ణ‌తో ఫోన్ చేయించి, సంభాష‌ణ‌లో ఏవో అన‌రాని మాట‌లు అన్న‌ట్టు, న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచార‌నే నింద‌ను జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌పై మోపి…కావాల‌నే రాద్ధాంతం చేస్తున్నార‌ని అంటున్నారు.

అస‌లు ఈశ్వ‌ర‌య్య మాట‌ల్లో త‌ప్పేం ఉందో చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియా చెప్పాల‌ని, కోర్టుల‌ను ఎక్క‌డ కించ‌ప‌రిచారో నిర్ధారించాల‌ని బీసీలు డిమాండ్ చేస్తున్నారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీకి వ్య‌తిరేకంగా జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య విస్తృత ప్ర‌చారం చేయ‌డంతో పాటు ఆయ‌న పాల‌న‌లో బీసీల‌తో పాటు ఎస్సీ, ఎస్టీల‌కు చేసిన ద్రోహాన్ని చెప్పార‌న్నారు. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా క‌క్ష క‌ట్టి ఈశ్వ‌ర‌య్య‌పై ఓ ప‌థ‌కం ప్ర‌కారం కుట్ర‌ప‌న్నార‌ని మండిప‌డుతున్నారు.

ఎస్సీలు, బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని చంద్రబాబు గ‌తంలో కేంద్రానికి రాసిన లేఖలను ఈశ్వ‌ర‌య్య ఎన్నిక‌ల‌కు ముందు బ‌య‌ట‌పెట్ట‌డంతో ఆ సామాజిక వ‌ర్గం టీడీపీకి దూర‌మైంది.

ఆ త‌ర్వాత ప‌దేప‌దే చంద్ర‌బాబు చేసిన అన్యాయంపై ప్ర‌చారం చేయ‌డం, అది ఆ సామాజిక‌వ‌ర్గాల్లో బాగా చొచ్చుకెళ్లి చివ‌రికి బాబుకు త‌గిన బుద్ధి చెప్పారు. దాన్ని మ‌న‌సులో పెట్టుకున్న చంద్ర‌బాబు ఇప్పుడు అదును చూసి ఈశ్వ‌ర‌య్య‌తో పాటు జ‌గ‌న్ స‌ర్కార్ న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు వ్య‌తిరేక‌మ‌నే భావ‌న‌ను చిత్రీక‌రించ‌డానికి రామ‌కృష్ణ‌ను పావుగా వాడుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఈశ్వ‌ర‌య్య‌పై కుట్ర‌ప‌న్న‌డ‌మే కాకుండా, ఆయ‌నే హైకోర్టుపై కుట్ర చేస్తున్నార‌నే ప్ర‌చారం చేయ‌డం టీడీపీ, ఎల్లో మీడియాకే చెల్లింది. జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య‌పై నేతృత్వం వ‌హిస్తున్న బీసీ సంఘం ఇటీవ‌ల హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌పై కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ప్ర‌స్తుతం ఈశ్వ‌ర‌య్య‌పై సాగుతున్న కుట్ర ప‌ర్వం అనేక అనుమానాలకు తావిస్తోంది.

రాష్ట్ర హైకోర్టులో కరోనా వ్యాప్తి, హైకోర్టు ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ రాజశేఖర్ గుండెపోటుతో మరణించడం… త‌దిత‌ర అంశాలపైన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయ‌డాన్ని కూడా  హైకోర్టు ప్రతిష్టను దెబ్బతీయడానికి ఈశ్వరయ్య చేసిన కుట్రగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది.

ఇదిలా ఉండ‌గా ఈ పిటిష‌న్‌లో త‌న‌ను ఇంప్లీడ్ చేయాల్సిందిగా స‌స్పెండ్ జడ్జి రామ‌కృష్ణ కోర‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. హైకోర్టుపై జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య కుట్ర ప‌న్నుతున్నారంటూ త‌న‌తో ఫోన్లో మాట్లాడిన ఆడియో రికార్డ్‌ను ఆధారంగా చూపుతుండ‌డం గ‌మనార్హం.

అయితే చంద్ర‌బాబు ప్ర‌ధానంగా ఈశ్వ‌ర‌య్య  కేవ‌లం ఒక వ్య‌క్తి కాద‌ని, ఆయ‌న వెనుక బీసీ, ఇత‌ర అణ‌గారిన వ‌ర్గాల అండ‌దండ లున్నాయ‌న మౌళిక అంశాన్ని మ‌రిచిపోయారు. ఇప్ప‌టికే టీడీపీకి గ‌ట్టి అండ‌గా నిలిచిన బీసీ కోట‌ను జ‌గ‌న్ బ‌ద్ద‌లు కొట్టారు. ఉన్న ఆ స‌గం మంది కూడా దూరం చేసుకునేందుకే ఈశ్వ‌ర‌య్య‌పై ప్ర‌తీకారం తీర్చుకుంటున్నార‌నే వాద‌న వినిపిస్తోంది.

ఇప్పుడు ఏవేవో కార‌ణాల‌తో ఈశ్వ‌ర‌య్య‌పై గంట‌ల త‌ర‌బ‌డి టీవీ చ‌ర్చ‌లు, పేజీల‌కు పేజీలు వార్తా క‌థ‌నాలు వండి వార్చొచ్చు. వాటి వ‌ల్ల ఈశ్వ‌ర‌య్య‌కు పోయేదేమీ లేదు. పోయేద‌ల్లా చంద్ర‌బాబుకు బీసీల్లో గౌర‌వం, ఓట్లు మాత్ర‌మే. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈశ్వ‌ర‌య్య‌తో గేమ్ ఆడితే మంచిది. లేదంటే అస‌లుకే ఎస‌రు వ‌చ్చే ప్ర‌మాదం లేక‌పోలేదు.  

స్పీడ్ పెంచిన వీర్రాజు

శ్రీ రెడ్డి వల్ల కొత్తవాళ్ళకి న్యాయం జరిగిందా?