ఈ విషయంలో బాబును శత్రువులైనా పొగడాల్సిందే

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతోంది. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు నాయకులు, అధికారులు.  Advertisement మరి ఈ 15 రోజులు ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం…

రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మహాయజ్ఞంలా సాగుతోంది. 15 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు నాయకులు, అధికారులు. 

మరి ఈ 15 రోజులు ప్రజల దృష్టిని మరల్చాలంటే ఏం చేయాలి? ఏదో ఒక కార్యక్రమంలో జనంలోకి వెళ్లాలి. అటు పండగ జరుగుతుంటే.. ఇటు నిరసన కార్యక్రమాలతో దానిపై నుంచి దృష్టి మరల్చాలి. ఇలాంటి చీప్ ట్రిక్స్ చంద్రబాబుకి బాగా తెలుసు.

ఇళ్ల పట్టాల పంపిణీ రోజు.. టీడీపీ నేతలు ధర్మవరం యువతి హత్య కేసుని బాగా హైలెట్ చేశారు. అప్పటికే ఆ కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. అయితే కావాలనే ఆ విషయాన్ని తెరపైకి తెచ్చి హడావిడి చేశారు. 

ఆ తర్వాత ఇళ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగందనేది మరో ఆరోపణ. ఓవైపు ఇళ్ల పట్టాలు తీసుకుంటున్న పేదల మోముల్లో నవ్వులు కనిపిస్తుంటే.. మరోవైపు టీడీపీ నేతల మొహాల్లో నెత్తురు చుక్కలేదు. 30 లక్షల మంది ప్రజలు సంతోషంగా ఉంటే వారి కడుపుమంట ఎలా చల్లారుతుంది?

అందుకే ఇళ్ల స్థలాల సేకరణలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందనే వితండవాదం చేశారు టీడీపీ నేతలు. 300 చదరపు గజాల అపార్ట్ మెంట్లే కాదు, టిడ్కో నిర్మించిన అన్ని ఇళ్లనూ ఉచితంగానే ఇవ్వాలి డిమాండ్ చేశారు. తమ హయాంలో బ్యాంకు రుణాల పేరుతో పేదలపై భారం మోపిన టీడీపీకి ఇలాంటి విమర్శలు చేసే నైతిక హక్కు ఎక్కడిది?

కట్ చేస్తే.. ఈ రోజు నుంచి టీడీపీ చేపట్టిన రైతు పరామర్శ యాత్రలు మరో ప్రహసనంగా మారబోతున్నాయి. రైతులకు సంఘీభావం తెలుపుతూ 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు చేపడతామంటున్నారు టీడీపీ నేతలు. 

రైతు కుటుంబాలను పరామర్శించడం, రచ్చబండ, రెవెన్యూ ఆఫీస్ లు, రైతు భరోసా కేంద్రాల్లో వినతి పత్రాల సమర్పణ.. ఇలా మూడు రోజుల పాటు ఈ హడావిడి ఉంటుంది.

అంటే.. ఇళ్ల పట్టాల పంపిణీ అనే వేడుకను ప్రజల దృష్టి నుంచి మరల్చేందుకు, మరో మూడు రోజుల పాటు ఈ డైవర్షన్ కార్యక్రమం అన్నమాట. దీని తర్వాత రెడీ మేడ్ గా మరో కార్యక్రమం కూడా ఉంటుంది, లేకపోతే ఏదో ఒక సమస్యని తెరపైకి తీసుకురావడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య. 

ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబును మించినోడు లేడు. ఈ విషయంలో బాబును శత్రువులైనా పొగడాల్సిందే. పూర్వం యజ్ఞ యాగాదులను మారీచుడు, సుబాహువు అనే రాక్షసులు అడ్డుకునేవారు. యజ్ఞ ఫలాలు దక్కకుండా చేసేవారు. సరిగ్గా ఈకాలంలో కూడా చంద్రబాబు, లోకేష్ ఇలాంటి అవతారం ఎత్తారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. 

సీఎం జగన్ చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ అనే యజ్ఞాన్ని టీడీపీ నేతలు రాక్షసుల్లాగా అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. వైసీపీ ఆరోపణలకు తగ్గట్టే.. 15 రోజుల పాటు డైవర్షన్ పాలిటిక్స్ తో టీడీపీ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది.

అరియ‌నా ట్రోఫీ గెలుస్తుంద‌ని ఎదురుచూసా