భయాలు అనేక రకాలు. అందులో రాజకీయ జీవుల భయాలు వేరే రకాలు. ఇక ముమ్మారు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు భయం ఎపుడూ అధికారం తన వద్దకు రాకుండా పోతుందనే. అందుకే ఆయన అధికారంలో ఉన్నపుడు ఒక మాట. విపక్షంలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతారని విమర్శలు ఉన్నాయి.
ఇక ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా వరసగా తాను చేసిన అన్ని హామీలు నెరవేర్చేస్తున్నారు. ఇదే వరసలో ఇళ్ళ పట్టాలు ఏకంగా 30 లక్షల మంది పేదలకు ఏపీలో పంపిణీ చేయాలనుకుంటున్నారు. మరి ఇంత పెద్ద పధకం దేశంలోనే తొలిసారి కావచ్చు. దాన్ని కనుక చేసేస్తే జగన్ జనంలో దేవుడిగా గుండెల్లో కొలువుండిపోతారని చంద్రబాబు భయమట.
అందుకే చంద్రబాబు తన వారి ద్వారా కోర్టుల్లో కేసులు వేయించి పేదలకు గూడు లేకుండా అడ్డుకుంటున్నారని మంత్రి కొడాలి నాని అంటున్నారు. చంద్రబాబుది ఎపుడూ అధికార బాధ తప్ప పేదల గురించి ఆయనకు తపన ఏ మాత్రం లేదని నాని దుయ్యబెడుతున్నారు.
బాబు తాను సీఎంగా ఉన్నపుడు మహిళలను లక్షాధికారులను చేస్తామని పదే పదే చెప్పినా ఏమీ చేయలేకపోయారని నాని ఎద్దేవా చేశారు. ఇపుడు జగన్ లక్షల విలువ చేస్తే పట్టాలను మహిళల పేరిట ఇవ్వాలనుకుంటే మాత్రం మోకాలడ్డుతున్నారని ఇదే బాబు మార్క్ కుటిల నీతి అని నాని గట్టిగానే వేసుకున్నారు.
బాబు ఎన్ని రకాలుగా అడ్డుపుల్లలు వేసినా ఏపీలో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని, సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా అగవని, జగన్ జనం గుండెల్లో దేవుడిగానే ఎప్పటికీఉంటారని కూడా కొడాలి నాని పక్కా క్లారిటీగానే చెప్పారు. మరి ఈ మాటలు వింటే బాబు భయం ఇంతకు పందింతలు పెరిగిపోదా.