చంద్రబాబుకు ఇష్టాలు, అయిష్టాలు అలా సందర్భానుసారంగా, రాజకీయ అవసరాల బట్టి ఏర్పడుతూ ఉంటాయి. ఆయన ఏ దేశం వెళ్తే అక్కడ రాజధాని నచ్చుకున్న సంగతీ తెలిసిందే. బీజింగ్ లా, సింగపూర్ లా అమరావతిని చేస్తాను అని గట్టి మాటలు మాట్లాడిందీ ఇదే చంద్రబాబు.
ఇక హైదరాబాద్ ని తానే నిర్మించానని చెప్పుకున్న చరిత్రా చంద్రబాబుకు ఉంది. విభజన ఏపీలో బాబుకు ఇష్టమైన నగరాలు ఏవీ అంటే తడుముకోకుంటా అంతా చెప్పే మాట అమరావతి అనే. బాబుకు కూడా అదే కలల నగరం కూడా.
కానీ ఎపుడైతే జగన్ మూడు రాజధానులు అంటున్నారో నాటి నుంచి ఆయనకు విశాఖ మీద ప్రేమ ఒక్కసారిగా పెరిగిపోయిందేమో. అందుకే మాటిమాటికీ తనకు విశాఖ ఇష్టమైన సిటీ అంటున్నారు. అక్కడ ప్రజలు మంచివారు అని కూడా ఒక్కలా కీర్తిస్తున్నారు.
ఇపుడిలా విశాఖ మీద ఇన్ని బిస్కట్లు వేస్తున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్న అయిదేళ్ళలో ఇష్టపడిన విశాఖకు ఏం చేశారన్నది కూడా చూడాలి కదా. నాడు విశాఖ మెట్రో రైలు కూత పెట్టలేదు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంఖుస్థాపన రాళ్ళు తప్ప ఏమీ లేవు.
ఆఖరుకు విశాఖ సహా వెనకబడిన జిల్లాలకు కేంద్రం ఇచ్చే నిధులను కూడా దారి మళ్ళించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరి అభివ్రుధ్ధి ఏమీ చేయకుండానే విశాఖను ఇష్టపడుతున్నానని బాబు ఎలా చెబుతారని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. అన్నట్లు ఆనాడు అంతా విశాఖను రాజధాని చేయామంటే బాబు ఎందుకు చేయలేదో మరి అని కూడా అంటున్నారు.
మొత్తానికి విశాఖకు ఏమీ చేయకపోయినా ఈ సిటీ ఇష్టమని బాబు గారు అంటే విశాఖ జనం గుడ్డిగా నమ్మాలి. ఎందుకంటే వారంతా మంచివారు కదా. పొగడ్తలకు పడిపోతారు కదా.