మార్చి 2న బ్యాచులర్ సింగిల్

ఏప్రియల్ లో విడుదల దిశగా రెడీ అయిపోతోంది అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చైతూ-శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ విడుదల అన్నది డౌట్ కావడంతో తమ్ముడు అఖిల్ సినిమాను…

ఏప్రియల్ లో విడుదల దిశగా రెడీ అయిపోతోంది అఖిల్-బొమ్మరిల్లు భాస్కర్ ల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. చైతూ-శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా ఏప్రిల్ విడుదల అన్నది డౌట్ కావడంతో తమ్ముడు అఖిల్ సినిమాను హడావుడిగా రెడీ చేస్తున్నారు. అప్పుడే ప్రమోషన్లకు కూడా శ్రీకారం చుట్టేస్తున్నారు.

జిఎ 2 పతాకంపై బన్నీ వాస్ నిర్మించే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను మార్చి 2న విడుదల చేయబోతున్నారు. వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ లో వున్న పూజా హెగ్డే కథనాయిక. ఈ సినిమాలో ఎన్నారైగా అఖిల్ కనిపించబోతున్నాడు. యంగ్ ఎన్నారై పెళ్లి కోసం ఇండియాకు వచ్చినపుడు జరిగిన కథ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు మరో దర్శకుడు వాసు వర్మ కూడా ఈ సినిమా స్క్రిప్ఠ్ లో పాలు పంచుకున్నారు. ప్రతి రోజూ పండగే సినిమా హిట్ తరువాత బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమాతో తాను బౌన్స్ బ్యాక్ అవుతానని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నమ్మకంగా వున్నారు.

పూజకి నో చాన్స్.. కారణం అదే