హీరో నితిన్ చాక్ లెట్ బాయ్ లా కనిపిస్తాడు కానీ లోపల కాస్త అల్లరి అలాగే వుంది. భీష్మ సక్సెస్ మీట్ వేదిక మీద అది అలా చటుక్కున మెరిసింది. ఇటీవల కొంత కాలంగా ఛలో హీరో నాగశౌర్య కు ఛలో డైరక్టర్ వెంకీ కుడుముల కు మధ్య సెటైర్లు పడుతున్నాయి. ఛలో కథ తనదే అని నాగశౌర్య అనడం, దానికి కొనసాగింపుగా బోలెడు వార్తలు రావడం జరిగింది.
ఈ నేపథ్యంలో అసలే వార్తలు, యూ ట్యూబ్ విడియోలు నాగశౌర్యను వెంటాడుతుంటే, ఇప్పుడు లేటెస్ట్ గా నితిన్ ఈ వ్యవహారానికి ఆజ్యం పోసాడు. భీష్మ సక్సెస్ మీట్ జరుగుతుంటే, దర్శకుడు వెంకీ కుడుముల స్పీచ్ పూర్తయిపోయింది. ఆ వెంటనే నితిన్ మైక్ అందుకుని, 'ఇంతకీ కథ నీదేనా? నా పేరు వేశావా' అని చమక్కు చేసాడు. దాని వెనుక వ్యవహారం అర్థమైన అందరూ ఫక్కున నవ్వారు.
ఈ విషయం ఇంక ఇక్కడితో ఆగిపోదు. మీమ్స్ రెడీ అవుతాయి. యూ ట్యూబ్ విడియోలు లోడ్ అవుతాయి. ఇంక మరి కొన్నాళ్లు నానా హడవుాడి.