మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు యథేచ్ఛగా రాయలసీమ, కడప, పులివెందుల వాళ్లను తిట్టడం పనిగా పెట్టుకున్నాడు. తానూ రాయలసీమ వాసిననే స్పృహ కూడా లేకుండా విమర్శలు చేస్తుంటాడు. తాను పుట్టి పెరిగిన గడ్డపై విషం చిమ్మేందుకు ఆయన ఏ మాత్రం వెనుకాడడు.
ప్రజా చైతన్యయాత్రలో భాగంగా సోమవారం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయిన్‌ని అడ్డగించడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఘాటుగా స్పందించాడు.
‘మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారు. కుప్పాన్ని పులివెందుల చేయాలనుకుంటున్నారు. బతకాలంటే వీళ్ల దయాదాక్షిణ్యాలు కావాలా? ’ అని కుప్పంలో చంద్రబాబు ధ్వజమెత్తాడు. మరి అమరావతిలో రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులపై బాబు ఏమంటారు?
టీవీ9 యాంకర్ దీప్తితో పాటు మరో ఇద్దరు జర్నలిస్టులపై భౌతిక దాడి, ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డిపై, బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌పై వరుసగా రెండు సారి, నగరి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా వాహనం అడ్డగింత, తహశీల్దార్ వనజాక్షి…తదితరులపై దాడులు కూడా పులివెందుల పనేనా? ఎంతో సౌమ్యులైన ఆ 29 గ్రామాల రైతులకు చేతకాకపోతే పులివెందుల , కడప నుంచి వెళ్లిన వాళ్లు దాడులు చేస్తున్నారా? సమాధానం చెప్పయ్యా కోస్తా ఇల్లరికపు అల్లుడా?