బాబుకు నిజంగానే చిప్ చెడింది

బాబుకు చిప్ చెడిందని, ఆయన బుర్రకు రిపేర్ అవసరమని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు వందశాతం నిజమని చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటారు. తాజాగా అలాంటిదే మరో ప్రయత్నం…

బాబుకు చిప్ చెడిందని, ఆయన బుర్రకు రిపేర్ అవసరమని వైసీపీ నేతలు ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు వందశాతం నిజమని చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటారు. తాజాగా అలాంటిదే మరో ప్రయత్నం చేశారు బాబు. తనకు అస్సలు బుర్ర లేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.

గతంలో టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేయాలని భావించి, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో అధికారులపై తీవ్ర విమర్శలు చేసి సస్పెండ్ అయిన నర్సీపట్నం మత్తు డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మృతిచెందారు. అప్పట్లో ఆయన కేసు సీబీఐకి అప్పగించడం పెద్ద సంచలనంగా మారింది. ఆ తర్వాత ఆ వ్యవహారం సద్దుమణిగినా.. ఇప్పుడు సుధాకర్ మృతితో మరోసారి చంద్రబాబు చెలరేగడమే అత్యంత నీఛమైన విషయం.

సుధాకర్ గుండెపోటుతో మృతిచెందితే దానికి కారణం ప్రభుత్వమేనంటూ చంద్రబాబు విమర్శించడం ఆయన పిచ్చికి పరాకాష్ట. మాస్క్ లు అడిగిన పాపానికి ఆయన్ని సస్పెండ్ చేశారని, శారీరకంగా హింసించి, నడిరోడ్డులో బట్టలు విప్పించి వేధించారని అన్నారు. అంతే కాదు.. ఆయన కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అప్పట్లో మత్తు డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని టీడీపీ స్వలాభం కోసం వాడుకుంది. కరోనా వచ్చిన కొత్తల్లో మాస్క్ ల కొరత ఉన్న సమయంలో అధికారుల్ని కించపరిచేలా ఓ వీడియో రూపొందించిన సుధాకర్ దాన్ని సామాజిక మాధ్యమాల్లో వదిలారు.

క్రమశిక్షణ చర్యలు తీసుకున్న అధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. దీనిపై న్యాయపోరాటానికి దిగిన సుధాకర్.. అదే క్రమంలో ఓ రోజు ఫుల్లుగా మందుకొట్టి కారు నడుపుతూ వీరంగం వేశారు. కారులో మద్యం బాటిళ్లతో అడ్డంగా బుక్కయినా వాటిని పోలీసులే పెట్టారని, తన కారులో లక్షల రూపాయల డబ్బులు కాజేశారని ఆరోపించారు సుధాకర్. పోలీసులు కొట్టారంటూ నడిరోడ్డుపై చొక్కా విప్పి బైఠాయించి.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.

ఈ ఎపిసోడ్ ని కూడా చంద్రబాబు, ప్రభుత్వంపై బురదజల్లేందుకు వాడుకున్నారు. కొన్నాళ్లు సుధాకర్ కు వైజాగ్ మెంటల్ ఆస్పత్రిలో చికిత్స కూడా జరిగింది. చివరకు కోర్టు జోక్యంతో.. సుధాకర్ కేసు సీబీఐకి వెళ్లడం అప్పట్లో మరో పెద్ద సంచలనం. అయితే ఆ కేసు విచారణ కొలిక్కి రాకముందే, విధుల్లోకి తీసుకోకముందే సుధాకర్ గుండెపోటుతో మృతిచెందారు.

ఎన్టీఆర్ కుటుంబానికి ఎన్ని కోట్లు పరిహారం ఇవ్వాలి..?

సుధాకర్ గుండెపోటుకి ప్రభుత్వం కారణం అయితే, ఎన్టీఆర్ అకాల మరణానికి బాబు వెన్నుపోటు కారణం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సుధాకర్ పై ప్రభుత్వం కేవలం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ను ఉద్యోగం నుంచి తీసివేయలేదు. 

కేసు పూర్తయితే.. తిరిగి విధుల్లో చేరే అవకాశం కూడా ఆయనకుంది. అయితే సుధాకర్ అనారోగ్య సమస్యలతో అకాల మరణం చెందారు. దీనికి ప్రభుత్వాన్ని నిందించడం ఎంతవరకు సబబో చంద్రబాబే ఆలోచించాలి.

సుధాకర్ మరణించారని తెలిసిన వెంటనే ప్రభుత్వ హత్య అనేసిన బాబు తన పరువు తానే తీసుకున్నారు. శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ తానేనని మరోసారి రుజువు చేసుకున్నారు. బాబుకు నిజంగానే చిప్ చెడింది. బుర్ర షెడ్డుకెళ్లింది.