ఇటు చూడు బాబు.. పరువు పోతోందిక్కడ

రాష్ట్రంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ పదే పదే వైసీపీపై నిందలేస్తున్న చంద్రబాబు.. పరోక్షంగా తన నాయకుల పరువు తీస్తున్నారు, తద్వారా తన పరువు తానే తీసుకుంటున్నారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర్నుంచి.. సబ్బం…

రాష్ట్రంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ పదే పదే వైసీపీపై నిందలేస్తున్న చంద్రబాబు.. పరోక్షంగా తన నాయకుల పరువు తీస్తున్నారు, తద్వారా తన పరువు తానే తీసుకుంటున్నారు. ప్రజావేదిక కూల్చివేత దగ్గర్నుంచి.. సబ్బం హరి టాయిలెట్స్ వరకు.. ఇదే తంతు.

ప్రజావేదిక-కరకట్ట రాజకీయం:

నాడు ప్రజావేదిక కూల్చివేస్తే.. దాన్నేదో తనపై జరిగిన దాడిలాగా చిత్రీకరించాలని చూశారు చంద్రబాబు. ఇటీవల రెండుసార్లు వచ్చిన వరదలకు ప్రజావేదిక దాకా కృష్ణమ్మ వరద ఎగదన్నడంతో.. ప్రజలకు అసలు విషయం అర్థమైంది. కరకట్టను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తే బాబు కన్నీరెందుకు పెట్టుకున్నారంటూ ప్రజలు చీత్కరించుకున్నారు.

రివర్స్ అయిన బీసీ కార్డు: 

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం కూడా ఇలాగే హైలెట్ అయింది. దీన్ని ఓ సాధారణ కేసుగా పరిగణించి ఉంటే.. పైల్స్ ప్రాబ్లమ్, ఆ తర్వాత కరోనా సమస్యతో.. ఎలాగోలా బెయిల్ తో తప్పించుకునేవారు అచ్చెన్నాయుడు. 

అయితే దాన్ని బీసీలపై దాడిగా అభివర్ణించి రచ్చ చేయాలని చూశారు బాబు. దీంతో సీన్ రివర్స్ అయింది. బీసీలైతే తప్పు చేయరా? తప్పు చేస్తే కులాలను బట్టి వెనకేసుకొస్తారా అంటూ.. చాలామంది ఎదురు తిరిగారు.

దీంతో అసలు అచ్చెన్నాయుడు చేసిన కుంభకోణం వివరాలన్నీ  బైటకొచ్చాయి. లోకేష్ ని కాపాడ్డం కోసమే అచ్చెన్న బలిపశువుగా మారారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడ కూడా బాబు పాచిక పారకపోగా సీన్ రివర్స్ అయింది, అచ్చెన్నపై అవినీతి నాయకుడిగా ముద్ర పడింది.

కొల్లు-జేసీ దొందూ దొందే: 

మరో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పరిస్థితి కూడా అంతే. హత్య కేసులో నేరుగా కొల్లు పేరు బైటకొచ్చిందంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు చేసిన రచ్చతో కొల్లు ఇంతటి కంత్రీనా అనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది.

ఇక జేసీ సోదరుల పరిస్థితి కూడా బాబు పరామర్శల పర్వంతోనే రచ్చకెక్కింది. వీళ్లిద్దరి అవినీతిని, క్రిమినల్ బ్రెయిన్స్ ను సక్సెస్ ఫుల్ గా జనాలకు చూపించిన ఘనత కచ్చితంగా బాబుదే.

సబ్బంతో పబ్బం గడిపిన బాబు: 

తాజాగా “సబ్బం సులభ్ కాంప్లెక్స్” వ్యవహారం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి సబ్బం టాయిలెట్స్ కట్టుకున్నారనేది వాస్తవం, వాటిని అధికారులు తొలగించారనేది కూడా వాస్తవం. అయితే సబ్బం ఇంటినేదో కూల్చేసినట్టు, ఆయనపై దాడి జరిగినట్టు, విశాఖలో రౌడీయిజం అంటూ చంద్రబాబు చేసిన ప్రచారం పూర్తిగా ఆయన నీఛ రాజకీయాలను మరోసారి కళ్లకు కట్టింది.

సబ్బం వ్యవహారంలో బాబు కలుగజేసుకోకుండా ఉంటే ఆ వివాదం ఉత్తరాంధ్ర వరకే పరిమితం అయ్యేది. బాబు ఎంట్రీతో, సబ్బం నోటి దురుసుతో.. అది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

టీడీపీ నాయకుల ఆక్రమణల పర్వాన్ని ప్రజల కళ్లకు కట్టింది. ఇప్పుడు సబ్బం క్షమాపణలు కోరినా, బాబు సైలెంట్ గా ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదు. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇలా అధికారం పోయినప్పట్నుంచి రాజకీయ రాద్దాంతం చేస్తున్న బాబు.. తన పరువును, తన పార్టీ పరువును తనకు తెలియకుండానే బజారుకీడ్చారు.

జడ్జిమెంట్స్ పై నాకు ఎంతైనా మాట్లాడే హక్కుంది