బాబు మళ్లీ మార్చే చాన్సే లేదు

జగన్ ప్రభుత్వం మారిపోయి, మరో ప్రభుత్వం వచ్చి, రాజధానిని మళ్లీ మారిస్తే గతేంటీ? ఆంధ్ర ఇలా అధోగతి పాలవ్వడమేనా? అని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. కానీ మెడ…

జగన్ ప్రభుత్వం మారిపోయి, మరో ప్రభుత్వం వచ్చి, రాజధానిని మళ్లీ మారిస్తే గతేంటీ? ఆంధ్ర ఇలా అధోగతి పాలవ్వడమేనా? అని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. కానీ మెడ మీద తలకాయ వున్నవారు ఎవ్వరూ ఈ వాదనతో అంగీకరించరు. ఎందుకంటే…

2024 ఎన్నికలు వచ్చాయి అనుకుందాం. అప్పుడు జగన్ ఏమని ప్రచారం చేస్తారు. తమ ప్రభుత్వం రాకపోతే, ఉత్తరాంధ్ర నుంచి రాజధాని తరలిపోతుంది. రాయలసీమ కు హైకోర్టు వుండదు అనేగా. అదే సమయంలో బాబుగారు కావచ్చు, మరొకరు కావచ్చు తాము గెలిస్తే రాజధాని మార్చము అనే చెప్పాల్సి వుంటుంది, ఆ విధంగా కనీసం తొమ్మిది జిల్లాల జనాల్ని నమ్మించాల్సి వుంటుంది.  

జగన్ వెనుక వుండేవి రాయలసీమ,ఉత్తరాంధ్ర జిల్లాలు. బాబుగారి వెనుక వుండేవి కృష్ణ, గుంటూరు జిల్లాలు.తటస్థంగా వుండేవి ఈస్ట్ వెస్ట్ అనుకుందాం. అలాంటపుడు ఎవరికి ఎడ్జ్ వుంటుంది? పోనీ రాజధాని మార్చారు అనుకుందాం. ఆ తరువాత ఎన్నికలకు ఇలా మార్చిన పార్టీని ఈ తొమ్మిది జిల్లాల వారు ఏం చేస్తారు?

ఇప్పుడు చెప్పండి. మరోసారి రాజధాని మార్చడం సాధ్యమవుతుందా? అలా సాధ్యం అవుతుందనే నమ్మకం, విశ్వాసం వీలు వుంటే, ఇప్పుడు సైలంట్ గా వుండిపోవచ్చు కదా, నాలుగేళ్ల తరువాత వెనక్కు తెచ్చేసుకోవచ్చు కదా. వీలు కాదనే ఈ యాగీ అంతా.

చంద్రబాబు స్వయంకృతాపరాధం

పవన్ కళ్యాణ్ తో నా ఎక్స్పీరియన్స్