వెంకటేష్-తరుణ్ భాస్కర్.. చాన్నాళ్లుగా వినిపిస్తున్న కాంబినేషన్ ఇది. కానీ ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. వెంకీకి తరుణ్ చెప్పిన కథ నచ్చలేదని చాలామంది అనుకున్నారు. ఎట్టకేలకు దీనిపై స్పందించాడు తరుణ్ భాస్కర్. వెంకీతో సినిమా చేయడం కోసం ఇంకాస్త టైమ్ తీసుకుంటానంటున్నాడు ఈ డైరక్టర్.
“వెంకటేష్ గారితో ఆల్రెడీ మాట్లాడాను. మనస్తత్వంలో ఆయన నాకంటే యంగ్. మోస్ట్ ఛిల్ గయ్. ఓరోజు సెడన్ గా వచ్చి నాతో 3-4 గంటలు మాట్లాడారు. ఆయన ఎంత ఆధ్యాత్మికంగా ఉంటారో, మెంటల్లీ ఎంత యంగ్ గా ఉంటారో నాకు అప్పుడు అర్థమైంది. వెంకటేష్ గారిని మనం ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఆయన రియల్ క్యారెక్టర్ ఇంకా ఎంటర్ టైనింగ్. చాలా ఛిల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ను బయటకు చూపించాలనే ప్రయత్నంలో ఉన్నాను.”
ఇలా వెంకీతో చేయాల్సిన సినిమాపై క్లారిటీ ఇచ్చాడు తరుణ్. ఆ ప్రాజెక్టు ఆగిపోలేదని చెబుతూనే.. ఆయన ఇమేజ్ ను స్పాయిన్ చేసేలా మాత్రం సినిమా చేయనంటున్నాడు. అందుకే టైమ్ తీసుకుంటున్నానని ప్రకటించాడు.
“ఆయనకు నేను చెప్పిన స్టోరీలైన్ నచ్చింది. కానీ ఇంకా మార్పులు చేయాలి. అది పెర్ ఫెక్ట్ గా వచ్చేంత వరకు వెంకటేష్ గారిని కలవను. ఎందుకంటే ఆయన ఇమేజ్ ను నేను స్పాయిల్ చేయను. మా ఇద్దరి కాంబోలో సినిమా వచ్చినప్పుడు మాత్రం అది తెలుగు ప్రేక్షకులందరికీ ట్రీట్ అవుతుంది.”
ఈ లాక్ డౌన్ టైమ్ లో 4-5 స్టోరీలు రాసే పని పెట్టుకున్నాడట తరుణ్ భాస్కర్. అయితే మెల్లమెల్లగా రాస్తున్నాడట. లాక్ డౌన్ తర్వాత మళ్లీ బిజీ అవుతానంటున్నాడు ఈ దర్శకుడు.