నాట్స్ కవితల పోటీకి అనూహ్య స్పందన

ఆగస్ట్ 15,  భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “నా దేశం-నా జెండా” అనే అంశంపై  నాట్స్ నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం…

ఆగస్ట్ 15,  భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “నా దేశం-నా జెండా” అనే అంశంపై  నాట్స్ నిర్వహించిన కవితల పోటీకి అనూహ్య స్పందన లభించింది. నాట్స్ మొదటి సారిగా నిర్వహించిన ఈ కవితాస్పర్థలో ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కవులు అశేషంగా పాల్గొన్నారు. 

“ప్రస్తుతానికి దాదాపు 830 పైచిలుకు కవితలు మా ఈ-మెయిల్ [email protected] కు అందాయి.  భారత కాలమానం ప్రకారం ఈ పోటీ ఆగస్ట్ 3 రాత్రి 12 గంటలకు ముగియనుంది” అని ఈ కార్యక్రమ నిర్వాహకులు డా. సూర్యం గంటి అన్నారు. 

న్యాయనిర్ణేతల పరిశీలనానంతరం ఆగస్ట్ 10 న ఈ క్రింది పురస్కార విజేతల పేర్లతో ఫలితాలు వెల్లిడించబడతాయి. 

సర్వోత్తమ పురస్కారం: రూ 20,000/-
ఉత్తమ పురస్కారం: రూ 15,000/-
విశిష్ట పురస్కారం: రూ 10,000/-
విశేష పురస్కారం: రూ 5,000/-

మరియు
ఐదు గౌరవ పురస్కారాలు ఒక్కొక్కరికీ రూ 2000/-

“పురస్కారాలు గెలుపొందిన తొమ్మిది మంది కవులూ నలుగురు సినీ కవులతో కవితా సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్ట్ 14 సాయంత్రం నాట్స్ యూట్యూబ్ ఛానల్లోనూ, సామాజిక మాధ్యమంలోనూ ప్రసారం చేస్తాం”, అని సంచాలకులు శ్రీ రాజశేఖర్ అల్లాడ తెలిపారు. 

కవిసమ్మేళనంలో పాల్గొనబోతున్న సినీ కవులు 
1. శ్రీ చంద్రబోస్
2. శ్రీ భాస్కరభట్ల రవికుమార్
3. శ్రీ రామజోగయ్య శాస్త్రి
4. శ్రీ సిరాశ్రీ

“మొదటి సారిగా ఈ ప్రయత్నం చేసాం. అనుకున్నదాని కంటే గొప్ప స్పందన లభించింది”, అని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డా. ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. 

“ఇంతటి విశేష స్పందన వచ్చిన కారణంగా తరచు ఇటువంటి పోటీలను నిర్వహించే ఆలోచన చేస్తున్నాం” అని నాట్స్ నూతన అధ్యక్షులు శ్రీ శేఖర్ అన్నె చెప్పారు. 

“తెలుగు వారిలో ఉన్న ఎందరో మంచి కవులను గుర్తించడం, వారి ప్రతిభను నలుగురికీ తెలియజేయడం అనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఈ పోటీకి ఇంతటి ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రతిభాశాలురందరికీ ధన్యవాదాలు”, అని నాట్స్ చైర్మన్ శ్రీ శ్రీధర్ అప్పసాని తెలిపారు. 

ఫలితాలు ఆగస్ట్ 10 న తెలియనున్నాయి.