ప‌వ‌న్ డిమాండ్‌తో టీడీపీ ఉక్కిరిబిక్కిరి

వ‌కీల్‌సాబ్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అంతా అమాయ‌కుడు అనుకున్నారు కానీ, ఆయ‌న రాజ‌కీయం చూస్తుంటే అలా అనిపించ‌డం లేదు. ఏపీ రాజ‌కీయాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న‌ట్టే ఉన్నాడు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై  పవన్ మాట‌లు…

వ‌కీల్‌సాబ్‌, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను అంతా అమాయ‌కుడు అనుకున్నారు కానీ, ఆయ‌న రాజ‌కీయం చూస్తుంటే అలా అనిపించ‌డం లేదు. ఏపీ రాజ‌కీయాల‌ను బాగా ఒంట‌బ‌ట్టించుకున్న‌ట్టే ఉన్నాడు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై  పవన్ మాట‌లు ఆయ‌న రాజ‌కీయ ప‌రిణితి తెలియ‌జేస్తున్నాయి. ఇంత‌కాలం ఆత్మ‌ర‌క్ష‌ణ రాజ‌కీయాలు చేస్తూ వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌…ఇప్పుడు ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేలా మాట్లాడుతుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

రాజ‌కీయం అనేది ఒక క్రీడ అయితే, త‌న‌కు బౌన్స‌ర్లు వేయ‌డం వ‌చ్చ‌ని, ఎదుటి వాళ్ల‌ను మాట‌ల‌తో చిక్కుల్లో ప‌డేసే విద్య తెలుసున‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు. తాజాగా ఆయ‌న తెర‌పైకి తీసుకొచ్చిన డిమాండే నిద‌ర్శ‌నం.

‘రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు.. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేయాలి. అధి కార, ప్రతిపక్షాలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, భూములు ఇచ్చిన రైతులపై బాధ్యత ఉన్నా ప్రత్యక్ష పోరాటం మొదలు పెట్టాలి. రైతులకు అన్యాయం చేయడంలో వైసీపీ, టీడీపీ రెండూ ఒకలాంటివే. నిలదీయాలనుకున్న వారు ఆ పార్టీలను నిలదీయాలి. తప్పుచేసింది ఆ పార్టీలైతే జనసేనను ఎలా ప్రశ్నిస్తారు?’ ఇదీ వ‌కీల్‌సాబ్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజా వాద‌న‌.

ప‌వ‌న్‌క‌ల్యాన్ వాద‌న కూడా స‌మ‌ర్థ‌నీయ‌మే. జ‌గ‌న్ స‌ర్కార్ అమ‌రావ‌తి రైతుల‌ను నడిరోడ్డుపై ప‌డేసింద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ  గ‌గ్గోలు పెడుతోంది. ప‌వ‌న్ అన్న‌ట్టు   రైతులకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పం ఉంటే రాజీనామా ఎందుకు చేయ‌రు ? రాజ‌ధాని రైతుల కోసం ఆ మాత్రం చేయ‌రా? మ‌ధ్య‌లో జ‌న‌సేన‌ను ప్ర‌శ్నించ‌డంలో అర్థం ఏముంది?

ఒక‌ప్పుడు రాజ ధాని రైతుల్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వంచిస్తోంద‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే చెప్పారు క‌దా? అప్పుడు రైతులు లేదా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌ట్టించుకుందా? అలాంట‌ప్పుడు ప‌వ‌న్ ఎలా బాధ్యుడ‌వుతాడు?  నెమ్మ‌దిగా త‌న‌ను టార్గెట్ చేస్తున్నార‌ని గ్ర‌హించిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ అదును చూసి దిమ్మ‌తిరిగే డిమాండ్‌ను తెర‌పైకి తెచ్చారు. ప‌వ‌న్ తాజా డిమాండ్ టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

చంద్రబాబు స్వయంకృతాపరాధం