మండలి రద్దు పాపం బాబుదేనా.!?

శాసనమండలి అన్నది ఆరో వేలు అని చంద్రబాబు చెప్పారు. అక్కడ పెద్దలు  ఊసుపోక వచ్చిన ప్రతి ప్రభుత్వ బిల్లుని వెనక్కు పంపుతాన్నదీ ఆయన గారి భావనే. ఇలా చేస్తూ పోతే కాలయాపన తప్ప ప్రజా…

శాసనమండలి అన్నది ఆరో వేలు అని చంద్రబాబు చెప్పారు. అక్కడ పెద్దలు  ఊసుపోక వచ్చిన ప్రతి ప్రభుత్వ బిల్లుని వెనక్కు పంపుతాన్నదీ ఆయన గారి భావనే. ఇలా చేస్తూ పోతే కాలయాపన తప్ప ప్రజా ప్రభుత్వం అసలు పనిచేయలేదని గోడుమన్నది చంద్రబాబే.

అటువంటి బాబుకు ఇపుడు మండలి తెగ నచ్చేసింది. నిజమే.. బాబు టీడీపీలో  ఇంకా కాలు మోపీ మోపకముందే అన్న గారు దాని ఆయువు ఉసూరుమనిపించారు. ఇక బాబు ఉమ్మడి ఏపీ సీఎంగా తన జమానాలో  మండలి పునరుధ్ధరణ ఊసు  ఎపుడూ ఎత్తలేదు ఎందుకో అర్ధం కాదు కానీ వైఎస్సార్ మండలి పెడతాను అంటే కూడా బాబు  కస్సుమన్నారు.

చివరికి మండలి ద్వారా ఏ పార్టీ, ఏ నాయకుడూ  పొందనంత రాజకీయ ప్రయోజనాలు  బాబే పొందారు. తన కుమారుడి రాజకీయ పట్టాభిషేకానికి మండలినే ఆయన వేదికగా వాడుకున్నారు. రాత్రికి రాత్రే లోకేష్ బాబుకు  అయిదు శాఖల కిరీటాన్ని తగిలించి అమాత్య హోదా అందించిన మండలి అంటే బాబు కంటే ఎవరికి ఎక్కువ ప్రేమ  ఉంటుంది.

అందుకే   జగన్ మండలి రద్దు అంటే బాబు గారు ఇపుడు రివర్స్ లో కస్సుమంటున్నారు. కాలానికి అనుగుణంగా సిధ్ధాంతాలు మారుతాయని కూడా సమర్ధించుకుంటున్నారు. అవన్నీ పక్కన పెడితే జగన్ మండలిపై ఒక్క వేటు వేసి లేపేస్తే అందుకు బాబు కారకుడు అంటారేంటి

ఈ మాటలు అన్నది  టీడీపీ మాజీ తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఎ రహమాన్. బాబు చట్టాలను, చట్ట సభల నిబంధలను తుంగలోకి తొక్కి వీరంగం వేయకపొతే మండలి ఇప్పటికీ బతికే ఉండేదని రహమాన్ అంటున్నారు. ఏ పాపం ఎరుగని మంచి మనిషి, మర్యాదస్తుడు మండలి చైర్మన్ షరీఫ్ చేత తప్పు చేయించిన ఘనత కూడా బాబుదేనని ఆయన అంటున్నారు.

మండలిని గుప్పిట  పట్టి 151 సీట్లతో గెలిచిన ప్రజాప్రభుత్వాన్ని ఆటలాడించాలన్న చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనల వల్లనే మండలి బలి అయిపోయిందని రహమాన్ అంటున్నారు. గత ఏడు నెలలుగా మండలిలో బాబు చేసిన రాజకీయ పుణ్యమాని ఇపుడు ఏపీకి పెద్దల సభ అంటూ ఒకటి లేకుండా పోయిందని కూడా ఆయన పక్కా క్లారిటీగా తేల్చేశారు.

అంటే మండలిని  జగన్ రద్దు చేశాదేమోనని ఇప్పటికీ  భ్రమపడుతున్న తమ్ముళ్ళంతా ఇపుడు బాబు మీద పడి ఏడవాల్సిందేనని కూడా రహమాన్ తీర్పు సారాంశం. నిజానికి ఈ సంగతి ఎమ్మెల్సీ తమ్ముళ్ళకూ తెలుసు కానీ పార్టీ నుంచి బయటకు పోయి ధైర్యంగా మాట్లాడుతున్న రహమాన్ నిజాలెన్ని అయినా చెప్పగలరు, వారు మాత్రం జగన్నే తిడుతూ కాలక్షేపం చేయాలి మరి, తప్పదు కదా.

ప్రజలు చీకొట్టిన వాళ్ళ ఆమోదం అవసరమా

నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి