ప్రియా నీ ప్రేమ‌లేఖ చాలు అత‌ని జీవితానికి!

ఫిబ్ర‌వ‌రి 14…ప్ర‌పంచ ప్రేమికుల దినం. కానీ ఓ అమ్మ‌డు త‌న ప్రియుడికి రెండు వారాలు ముందుగానే త‌న‌లోని ప్రేమ‌కు అక్ష‌ర రూపం ఇచ్చి అద్భుత‌మైన ప్రేమ‌లేఖ‌ను రాసింది. ఆమే న‌టి ప్రియా భ‌వానీశంక‌ర్‌. త‌న…

ఫిబ్ర‌వ‌రి 14…ప్ర‌పంచ ప్రేమికుల దినం. కానీ ఓ అమ్మ‌డు త‌న ప్రియుడికి రెండు వారాలు ముందుగానే త‌న‌లోని ప్రేమ‌కు అక్ష‌ర రూపం ఇచ్చి అద్భుత‌మైన ప్రేమ‌లేఖ‌ను రాసింది. ఆమే న‌టి ప్రియా భ‌వానీశంక‌ర్‌. త‌న ప్రియుడు రాజ్‌కు అత‌ని పుట్టిన రోజు సంద‌ర్భంగా రాసిన ప్రేమ లేఖ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఆమె ప్రియుడు ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్నాడు.

బుల్లి తెర నుంచి వెండితెర‌కు వ‌చ్చిన ఈ అమ్మ‌డు స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క‌మ‌ల్‌హాస‌న్‌తో క‌లిసి ఇండియ‌న్ 2 అనే చిత్రంలో న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌జే సూర్య‌తో డేటింగ్‌లో ఉంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగిన‌ప్ప‌టికీ…అలాంటిదేమీ లేద‌ని అత‌ను కొట్టిప‌డేశాడు. ప్రియా కేవ‌లం మంచిస్నేహితురాలు మాత్ర‌మేన‌ని అత‌ను స్ప‌ష్ట‌త ఇచ్చాడు.

ప్ర‌స్తుతానికి వ‌స్తే ప్రియా త‌న స్నేహితుడు రాజ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రాసిన ప్రేమ లేఖ త‌న ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసింది. దీంతో పాటు స్నేహితునితో స‌న్నిహితంగా ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఇంత‌కూ ఆ ప్రేమ లేఖ ఎలా సాగిందంటే… 

‘పదేళ్ల క్రితం కళాశాలలో చాలా సంతోషంగా, ఆత్మస్థైర్యంతో  ఓ మాదిరి అందం కలిగిన నన్ను నువ్యు ప్రేమించినప్పుడు ఆశ్యర్యపడలేదు. ఇప్పటికీ అన్నింటినీ దాటి ఇంకా నాతో ఉండాలని కోరుకోవడమే ఆశ్చర్యంగా ఉంది.  పగిలిన భావాలను సేకరించుకుంటున్న ఒకరితో  ఉండడం అంత సంతోషాన్నివ్వదు. నువ్వు నేను వినడానికి మరిచిన సంగీతం లాంటి వారం. గాయాలను మరచిపోవడానికి కొత్త ప్రేమను విమర్శించనవసరం లేదు. పరిస్థితులకు మారని అభిమానం చాలు. నాకు ఒక పాప పుడితే తన జీవితంలో నీలాంటి వాడు ఒకడు ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను. నక్షత్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్రమే సూర్యుడివి. పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది.  

ప్రియా  భావ వ్య‌క్తీక‌ర‌ణ చాలా లోతైన‌, సునిశిత‌మైన , నిగూఢంగా సాగింది. ఇందులో ప్ర‌ధానంగా ‘నాకు ఒక పాప పుడితే త‌న జీవితంలో నీలాంటి వాడు ఒక‌డు ఉండాల‌ని ఆ భ‌గ‌వంతుని కోరుకుంటాను, న‌క్ష‌త్రాలు నిండిన నా జీవితంలో నువ్వు మాత్ర‌మే సూర్యుడివి’ అనే వాక్యాలు త‌న స్నేహితుడితో ఆమెకు ఎంత గాఢ‌మైన అనుబంధం ఉందో చాటుతున్నాయి. మొత్తానికి ప్రియా ప్రేమ‌లేఖ యువ‌త హార్ట్‌ను ట‌చ్ చేస్తూ సాగింది. అందుకే ఈ పోస్ట్‌కు ఇప్పటివరకు రెండు లక్షలకుపైగా లైక్స్‌ రావడం విశేషం. మొత్తానికి ఒక జీవితానికి స‌రిప‌డేలా ప్రేమ‌ను వ్య‌క్తీక‌రిస్తూ రాసిన లేఖను అత‌ను భ‌ద్రంగా దాచుకుంటాడ‌న‌డంలో సందేహం లేదు.

నేను అనుకున్నదానికంటే బాగా చేశాడు మా అబ్బాయి

పెళ్లి ఇప్పుడు ఎందుకండి