ఏమైనా తిట్టండి, ఎంతైనా చెప్పండి…టీడీపీ అధినేత చంద్రబాబు బుర్రే బుర్ర. నిజానికి చంద్రబాబు మేధస్సుకు ఏ నోబెల్ ప్రైజో దక్కాల్సింది. కానీ చంద్రబాబు దురదృష్టం, నోబెల్ అదృష్టం…ఆయనకు ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు దక్కలేదు. ప్రధానంగా రాజకీయ రంగంలో నోబెల్ ప్రైజ్‌కు స్థానం లేదు.
భౌతిక, రసాయన , వైద్యం, ఆర్థిక శాస్త్రాలతో పాటు సాహిత్యంలో విశేష కృషి చేసిన వారికి 1901 నుంచి ప్రతి ఏటా నోబెల్ భారీ ప్రైజ్ మనీతో సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ తర్వాత 1969 నుంచి ప్రపంచ శాంతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన వారికి కూడా నోబెల్ బహుమతి ఇస్తున్నారు. ఈ ఆరు బహుమతులను ప్రఖ్యాత స్వీడిష్ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ 1895 నాటి వీలునామా ప్రకారం ఆయన చనిపోయిన ఐదేళ్ల తర్వాత 1901లో ప్రారంభించారు.
ప్రపంచంలోనే నోబెల్ పురస్కారాలంటే విశిష్ట బహుమతులకు సంబంధించి ఓ ల్యాండ్ మార్క్‌గా చెప్పవచ్చు. వివిధ రంగాల్లో విశిష్ట కృషి, పరిశోధనలు చేసి సమాజాన్ని ముందుకు నడిపించే ఫలితాలిచ్చిన మహానుభావుల గౌరవార్థం బహూకరించే బహూకరించేదే నోబెల్ పురస్కారం.
మొదట్లో చెప్పినట్టు చంద్రబాబు లాంటి వారికి నోబెల్ పురస్కారం దక్కకపోవడం మహానుభావుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ అదృష్టం. ప్రస్తుతం సమాజం తలకిందులుగా ఉంది. కుట్రలు, కుతంత్రాలు, మోసాలు, మాయలు చేయడం మేధావితనమయ్యాయి. అందుకే ఈ కోణంలో చూస్తే చంద్రబాబు అపరమేధావే. తాజాగా రాజస్థాన్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చంద్రబాబును గుర్తు చేస్తున్నాయంటే ఆయనెంత గొప్పవారో అర్థమవుతోంది.
రాజస్థాన్‌లో అశోక్‌గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చి వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినప్పటికీ ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఆడియో టేపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యే భన్వర్లాంల్ శర్మతో కలిసి కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్‌జైన్ యత్రించారని, వారి కుట్రలకు సంబంధించి మూడు ఆడియో టేపులు తమ వద్ద ఉన్నాయని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాల ఆరోపించారు. అంతేకాదు కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు గజేంద్ర సింగ్ షెకావత్, సంజయ్‌జైన్, భన్వర్‌లాల్ శర్మపై రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
రాజస్థాన్ తాజా ఉదంతం 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టీపెన్కు రూ.50 లక్షల క్యాష్ ఇస్తూ నాటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడడంతో పాటు మనోళ్లు బ్రీప్డ్ మీ అంటూ చంద్రబాబు ఆడియో రికార్డ్ సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అప్పట్లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పీకల్లోతు ఇరుక్కుని , తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు అన్నీ వదులకుని ఏపీకి వచ్చిన సంగతి తెలిసిందే.
అదేంటో గానీ చాలా విషయాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచారు. వెన్నుపోటుకు ఆయనే తండ్రి. ఓటుకు నోటు అన్నా ఆయనే గుర్తుకొస్తారు. బ్రీప్డ్ అంటే చాలు ఎవరికైనా చంద్రబాబే మదిలో మెదులుతారు. చంద్రబాబు తెలివి తేటల స్ఫూర్తితో రాజస్థాన్‌లో అశోక్‌గహ్లోత్ ప్రభుత్వాన్ని బీజేపీ అగ్రనేతలు ప్రయత్నించినట్టున్నారు. ప్చ్…ఏం లాభం తెలంగాణలో చంద్రబాబు విఫలమైనట్టే….రాజస్థాన్‌లో బీజేపీ కూడా ఫెయిల్ అయినట్టుంది.