డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ తిరుమల ఆలయంలోకి ప్రవేశించాలంటూ టీడీపీ చేస్తున్న డిమాండ్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. మతాన్ని హైలెట్ చేస్తూ.. జగన్ ని హిందూ ద్వేషిగా చూపాలనుకుంటున్న బాబు కుటిల పన్నాగం పూర్తిగా రివర్స్ అయింది.
చిత్తూరు జిల్లా నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు జగన్ తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని ఒత్తిడి తెస్తూ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. శ్రీవారికి జగన్ ఒంటరిగా వెళ్లి పట్టువస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని కూడా సెలవిచ్చారు చంద్రబాబు. బాబు వ్యాఖ్యలు అనుకూల మీడియా ద్వారా బైటకు రావడంతో.. నెటిజన్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. కామెంట్ల రూపంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
బూట్లు వేసుకుని దేవుడికి పూజ చేసే చంద్రబాబు దేవుడి గురించి మాట్లాడటం, హిందూ మతం గురించి కామెంట్ చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఆయన చేసిన అపాచారాల వల్లే లోకేష్ లాంటి కొడుకు పుట్టాడని, పార్టీ అతీగతీ లేకుండా పోతోందని అన్నారు. అయోధ్యలో రామమందిరానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోడీ ఎవరిని వెంటపెట్టుకుని వెళ్లారని ప్రశ్నించారు. అప్పుడు లేవని నోరు.. ఇప్పుడెందుకు లేస్తోందని మండిపడ్డారు.
అంతర్వేది రథం దగ్ధమైన ఘటనను అడ్డు పెట్టుకుని మత రాజకీయాలను రెచ్చగొట్టిన చంద్రబాబు.. దానికి కొనసాగింపుగా డిక్లరేషన్ రాజకీయాన్ని తెరపైకి తెచ్చారు. అయితే అంతర్వేది విషయంలో ఆయనతో పాటు కలసి వచ్చిన బీజేపీ, జనసేన కూడా తిరుమల దర్శనం వ్యవహారంలో బాబుకి మద్దతు తెలపలేదు. దీంతో చంద్రబాబు డిక్లరేషన్ రాజకీయంలో ఒంటరిగా నిలిచారు.
ఇటు సామాన్య ప్రజల నుంచి కూడా బాబుపై తీవ్రమైన వ్యతిరేక వస్తోంది. ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి హోదాలో కూడా సీఎం జగన్ తిరుమల వెళ్లి వచ్చారు. అప్పుడు లేని మత ప్రస్తావన ఇప్పుడెందుకు అంటూ బాబుకి గడ్డిపెడుతున్నారు. ఇకనైనా ఇలాంటి నీఛ రాజకీయాలు మానుకోకపోతే.. టీడీపీ మరింత పాతాళానికి పడిపోవడం ఖాయమని శాపనార్థాలు పెడుతున్నారురు.
మొత్తమ్మీద మతపరంగా జగన్ ని కార్నర్ చేయాలనుకున్న చంద్రబాబు పాచిక పారకపోగా.. పూర్తిగా ఆయనకే రివర్స్ లో తగిలింది.