విమర్శల విషయంలో చంద్రబాబు పాతాళానికి దిగజారిపోయారు. సోషల్ మీడియాలో వస్తున్న జోకులు, ఇతర ఛానెళ్ల పేరుతో తయారైన మార్ఫింగ్ వీడియోలను కూడా తన ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ వెటకారం చేస్తున్నారు. ఈ స్థాయిలో జోకులు వేయడానికి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు? జగన్ ని అంతగా వెటకారం చేస్తున్న చంద్రబాబుకి తన కొడుకు గుర్తు రాలేదా..?
చినబాబుపై సోషల్ మీడియాలో పడే సెటైర్లు చంద్రబాబు కంటికి కనిపించ లేదా? లోకేష్ నోరు తెరిచి మాట్లాడకుండా ట్విట్టర్ కే ఎందుకు పరిమితమయ్యారో చంద్రబాబుకి తెలియదా? జయంతికి వర్థంతికి తేడా తెలియని మందళగిరి మాలోకాన్ని ఏపీ ప్రజలంతా పప్పు పప్పు అని వెటకారం చేస్తుంటే తన కొడుకు ఇంత అసమర్థుడా అని లోలోపల కుమిలిపోయేవారు చంద్రబాబు. తమ పార్టీ నేతలతో కౌంటర్ ఇప్పిద్దామన్నా అది కుదరని వ్యవహారం. అందుకే ఇన్నాళ్లూ చంద్రబాబు మౌనంగా మధన పడ్డారు, పడుతూనే ఉన్నారు. ఇంట్లో ఉత్తర కుమారుడ్ని పెట్టుకుని, ఇప్పుడు జగన్ పై రెచ్చిపోతున్నారు చంద్రబాబు.
వాస్తవానికి జగన్ పై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు చేసినవే తప్ప మరోటి కావు. వాటిని అడ్డం పెట్టుకుని, టీడీపీ ఏదో విజయాన్ని సాధించినట్టు, దేశమంతా జగన్ ని చిన్నచూపు చూస్తున్నట్టు తన స్థాయి దిగజార్చుకుని మాట్లాడారు చంద్రబాబు. ఇది కేవలం తన రాక్షసానందం కోసం పెట్టిన ప్రెస్ మీట్ తప్ప మరోటి కాదు.
వైసీపీ నాయకుల్ని రెచ్చగొట్టడం కూడా చంద్రబాబు హిడెన్ అజెండా. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ చేసింది తప్పు అంటూ వైసీపీ నేతలు విమర్శిస్తున్న వేళ, రాష్ట్రంలో కరోనా పరిస్థితి దారుణంగా ఉందంటూ మీడియా సమావేశం పెట్టిన చంద్రబాబు ఈసీని వెనకేసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. పరోక్షంగా రమేష్ కుమార్ కి మద్దతుగానే చంద్రబాబు బైటకొచ్చారు.
అంటే ఒక రకంగా వైసీపీ నేతల్ని బాబు మరింతగా రెచ్చగొడుతున్నారన్నమాట. వారి ఆగ్రహావేశాలను తమ అనుకూల మీడియాలో భూతద్దం వేసి మరీ చూపించి జనం దృష్టిలో వైసీపీ నాయకుల్ని పలుచన చేయాలనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్.