కరోనా టెర్రర్.. 7వేలు దాటిన మృతులు

కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 7వేలు దాటింది. 142 దేశాలకు పాకిన ఈ వైరస్.. ప్రస్తుతం చైనాతో పాటు ఇటలీ, ఇరాన్,…

కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 7వేలు దాటింది. 142 దేశాలకు పాకిన ఈ వైరస్.. ప్రస్తుతం చైనాతో పాటు ఇటలీ, ఇరాన్, స్పెయిన్ లో తన ప్రతాపం చూపిస్తోంది. చైనాలో ఇప్పటివరకు 3123 మంది మరణించగా.. ఇటలీలో 2158 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటలీలో వైరస్ సోకిన వారి సంఖ్య వారం రోజుల్లో 24 వేలకు చేరింది.

ఇటు భారత్ లో కరోనా కేసుల సంఖ్య 114కు చేరింది. దేశంలో మరిన్ని రాష్ట్రాలకు కరోనా వ్యాపించింది. తాజాగా ఒడిశాతో పాటు జమ్ముకశ్మీర్, లడక్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కొత్తగా మరో కరోనా కేసు నమోదైంది. స్కాట్లాండ్ నుంచి వచ్చిన 46 ఏళ్ల వ్యాపారికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్థారించారు.

జూబ్లిహిల్స్ కు చెందిన ఈ వ్యాపారి 7న హైదరాబాద్ నుంచి స్కాట్లాండ్ వెళ్లాడు. తిరిగి 13న హైదరాబాద్ వచ్చాడు. 15న కోవిడ్ లక్షణాలతో గాంధీ హాస్పిటల్ లో చేరాడు. ఇతడికి రిపోర్ట్ లో పాజిటివ్ అని తేలింది. 13 నుంచి 15వ తేదీ వరకు ఇతడు ఎవరెవర్ని కలిశాడనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణలో ఇది నాలుగో పాజిటివ్ కేసు. అయితే ఈ నలుగుర్లో ఒకరికి నయమైంది. అతడ్ని ఈమధ్య డిశ్చార్జ్ చేశారు.

కరోనా వల్ల ఇప్పటికే తెలంగాణలోని విద్యాసంస్థలు, మాల్స్ మూసేశారు. ఆదేశాలకు విరుద్ధంగా స్కూల్స్ తెరిచిన యాజమాన్యాలపై కేసులు పెడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లు అన్నింటినీ ఖాళీ చేయించారు. అటు హైకోర్టు కూడా స్వీయ నిబంధనలు విధించుకుంది. 31వ తేదీ వరకు వారానికి 3 రోజులు మాత్రమే (సోమ,బుధ,శుక్ర) కేసులు విచారించాలని నిర్ణయించుకుంది.

కరోనా కారణంగా తిరుపతిలో టైమ్ స్లాట్స్ ఆధారంగా మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నారు. ఇవాళ్టి నుంచి కంపార్ట్ మెంట్స్ లో వేచి ఉండే పద్ధతిని ఆపేసి, నేరుగా క్యూలైన్లో వెళ్లి దర్శనం చేసుకునే ఏర్పాటు చేస్తున్నారు. అటు ఏసీ రైళ్లలో ఉష్ణోగ్రతను 25 డిగ్రీలకు తగ్గకుండా చర్యలు చేపట్టింది రైల్వే శాఖ. దీంతో పాటు ఏసీ బోగీల్లో కిటీలకు ఉండే కర్టెన్లను తొలిగించాలని, పడుకునేందుకు ఇచ్చే కంబళ్లను నిలిపివేయాలని నిర్ణయించింది. ఎందుకంటే వీటిని ప్రతిరోజూ శుభ్రపరచరు.

నన్ను కూడా సేమ్ టు సేమ్ అంటారేమోనని కొంచెం భయం

యుద్ధం మధ్యలో యోగాసనాలు వెయ్యకూడదు