అవిగో మృతదేహాలు.. ఇదిగో బాబు వాలిపోయారు

మృతదేహాలు కనపడితే చాలు చంద్రబాబు రెక్కలు కట్టుకుని ఆ ఘటనపై వాలిపోతున్నారు, రాజకీయం చేసేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 9మంది మృత్యువాత పడిన ఘటనపై చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు.…

మృతదేహాలు కనపడితే చాలు చంద్రబాబు రెక్కలు కట్టుకుని ఆ ఘటనపై వాలిపోతున్నారు, రాజకీయం చేసేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి 9మంది మృత్యువాత పడిన ఘటనపై చంద్రబాబు వెంటనే రియాక్ట్ అయ్యారు. అయితే అలవాటులో పొరపాటుగా మాట మార్చేశారు, మడమ తిప్పేశారు.

“కరోనా కష్టకాలంలో లిక్కర్ షాపులు ఎందుకు, పేదల కష్టాన్నంతా లిక్కర్ ద్వారా ప్రభుత్వం సొమ్ము చేసుకుంటోంది, లిక్కర్ షాపుల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతోంది.” ఇదీ నిన్నటి వరకూ చంద్రబాబు చేసిన వితండవాదం. అదే బాబు ఈరోజు నాలిక మడతపెట్టేశారు.

“లిక్కర్ షాపులు అందుబాటులో లేకపోవడం వల్లే కదా కురిచేడులో మందుబాబులు శానిటైజర్ తాగారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అంటూ రెచ్చిపోతున్నారు. అసలు చంద్రబాబు బాధేంటి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఆయనకి ఏదో ఒక సాకు కావాలి. మద్యం దుకాణాల్ని తెరిస్తే కరోనా వస్తుందంటారు, మూసేస్తే జనం మందు కోసం చచ్చిపోతున్నారని శాపనార్థాలు పెడతారు.

తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన రెండు నాల్కల ధోరణిని, ఆయన నాలుకలో మడతల్ని మరోసారి బయటపెట్టాయి. మద్యపాన నిషేధం కోసం ఓవైపు సీఎం జగన్ సిన్సియర్ గా ప్రయత్నిస్తుంటే.. బాబు లాంటివారు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఎక్కడ చావు వార్త వినపడితే చాలు అక్కడ చంద్రబాబు డప్పు కొట్టడం మొదలు పెడుతున్నారు.

కరోనా వల్ల చనిపోయిన మృతదేహాల ఖననం విషయంలో ఇటీవల చంద్రబాబు శవరాజకీయాలకు తెరతీశారు. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు.. దేశ సగటులో సగానికి సగం ఉన్నా కూడా చంద్రబాబు శవరాజకీయాలు మానలేదు. తాము చనిపోయినా కూడా బాబు తమని ఇలా వాడుకుంటున్నాడంటూ కరోనా మృతదేహాలన్నీ ఘోషిస్తున్నాయి. వారి ఆత్మఘోష బాబుకి వినపడదు.

ఇప్పుడు శానిటైజర్లు తాగి చనిపోయిన వారి ఆత్మలు కూడా చంద్రబాబుకి తాము పావులుగా మారామని తీవ్రంగా బాధపడుతుంటాయి. ఈ ఆత్మఘోష కూడా బాబు చెవికెక్కదు. ఎందుకంటే.. ఆయనకు ఆత్మలతో పనిలేదు, మృతదేహాలపైనే మక్కువ ఎక్కువ. ఆయనదంతా శవరాజకీయం. నయా నీచ రాజకీయం.

రామ్ గోపాల్ వర్మని మించిన సక్సెస్ ఫుల్ పర్సన్ ఎవరూ లేరు