అసలు బాబు ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నట్టు?

చంద్రబాబు రాజకీయం పూర్తిగా నేలచూపు చూస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే ఆయన.. ఇప్పుడు అత్యంత పతనావస్థను ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఒకటో రెండో పాయింట్లు కనిపించేవి. జగన్ ను భలే…

చంద్రబాబు రాజకీయం పూర్తిగా నేలచూపు చూస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే ఆయన.. ఇప్పుడు అత్యంత పతనావస్థను ఎదుర్కొంటున్నారు. గతంలో చంద్రబాబు ప్రసంగాల్లో ఒకటో రెండో పాయింట్లు కనిపించేవి. జగన్ ను భలే ఇరికించారే అనుకోడానికి పచ్చ బ్యాచ్ కైనా అవకాశం ఉండేది, నిన్నమొన్నటి వరకూ జగన్ కేసుల్ని మాత్రమే హైలెట్ చేస్తూ వచ్చారు, ఇప్పుడు అది కూడా పసలేని సబ్జెక్ట్ అయిపోయింది. అసలిప్పుడు చంద్రబాబు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారో, ఏం మాట్లాడటానికి మీడియాని పిలుస్తున్నారో అర్థం కావడంలేదు.

స్థానిక ఎన్నికల వేళ, టీడీపీ నేతలంతా పొలోమంటూ వైసీపీ గూటికి చేరుతున్న సందర్భంలో చంద్రబాబు తన అక్కసు వెళ్లగక్కడానికి మీడియా ముందుకొస్తున్నారు తప్ప, అందులో ఎలాంటి సమాచారం ఉండడం లేదు. దీనికి తోడు మీడియా ముందు చేసే హంగామా మరో ఎత్తు. విశాఖ విమానాశ్రయం వద్ద తనకు జరిగిన “ప్రజా సన్మానం” నుంచి, నిన్న తమ నేతలపై దాడి జరిగిందంటూ డీజీపీ కార్యాలయం ముందు బైఠాయించడం వరకు బాబు బాగానే హంగామా చేస్తున్నారు.

ఈ హంగామా తప్పితే, ఆయన మాటల్లో వాలీడ్ పాయింట్ ఒక్కటి కూడా ఉండడం లేదు. చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే.. ఇక సీఎం ఏం చేయకూడదు అన్నట్టుగా ఉంది. విద్యా శాఖతో ముఖ్యమంత్రి జరిపిన సమీక్షపై బాబు విమర్శలు సంధించారు. గతంలో నిఘా యాప్ విడుదల సమయంలో కూడా అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా ప్రభుత్వం చెప్పినట్టే నడుస్తోందని విమర్శిస్తారు. అంతలోనే.. ఈసీకి ఫిర్యాదు చేస్తాం, అధికారులకు పరిస్థితులు వివరిస్తామంటూ మరో వాదన.

ఇలా పూర్తిగా డిఫెన్స్ లో పడిపోయారు కాబట్టే.. చంద్రబాబు పసలేని విమర్శలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు. అత్యంత పేలవంగా ఉంటున్న బాబు ప్రెస్ మీట్లను యెల్లో మీడియా సైతం పెద్దగా పట్టించుకోవట్లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

ఆది సోదరులూ వైసీపీలోకే.