అవును మరి విశాఖ అంటే బాబుకు ప్రేమ. ఎలాంటి ప్రేమ అంటే ఎప్పటికీ ఈ సిటీ ఎప్పటికీ ఇలాగె ఉండిపోవాలన్న ద్రుతరాష్ట్ర కౌగిలి లాంటి ప్రేమ. విశాఖ విషయంలో బాబు ఇంకా విషం చిమ్ముతూనే ఉన్నారు.
ఓ వైపు కరొనా కాటేస్తోంది. జీవితాలకు ధీమా లేకుండా చేస్తూ ఎక్కడికక్కడ మరణ శాసనం విధిస్తోంది. అయినా సరే బాబు మార్కు రాజకీయాలు ఆపరుగా. బాబు కరోనా కంటే కూడా విషం చిమ్ముతున్నారని, విశాఖ విషయంలో ఆయన పూర్తి వ్యతిరేకతను కనబరుస్తూ అడుగడుగునా అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడి వీరభద్రరావు అంటున్నారు.
బాబుకు ఇపుడు కరోనా ముఖ్యం కాదు, విశాఖకు రాజధాని కాకుండా అడ్డుకోవడమే ముఖ్యం. అందుక తన వారి ద్వారా కోర్టులో పిటిషన్లు వేయిస్తూ బ్రేకులు వేస్తున్నారని దాడి మండిపడుతున్నారు.
బాబు తాను ఇంకా అధికారంలో ఉన్నానని అనుకుంటున్నారని, అందుకే ఆయన సలహాలు ఇవ్వడం మాని ఆదేశాలు జారీ చేస్తున్నారని దాడి సెటీర్లు వేశారు. మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తాము చేసిన ఆరోపణలే ఇపుడు నిజం అవుతున్నాయని దాడి అంటున్నారు.