జగన్ సమర్థతను బైటపెట్టిన కరోనా

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇలాంటి టైమ్ లో కరోనా కష్టాలొచ్చాయి. ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు…

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసి చంద్రబాబు చేతులు దులుపుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నవ్యాంధ్రను ఒడ్డున పడేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. ఇలాంటి టైమ్ లో కరోనా కష్టాలొచ్చాయి. ఇదే పరిస్థితుల్లో చంద్రబాబు ఉండిఉంటే.. కరోనా పేరు అడ్డు పెట్టుకుని అన్నిట్లో కోతపెట్టేవారు, వాతలేసేవారు. కానీ జగన్ అలా కాదు, కష్టకాలంలో నిజమైన నాయకుడనిపించుకున్నారు.

ఆర్థికంగా పటిష్ట స్థితిలో ఉన్న పొరుగు రాష్ట్రంలో ఉద్యోగుల జీతాల్లో సగం కోతపెడితే.. మనరాష్ట్రంలో రెండు విడతలుగా ఇస్తామని మాటిచ్చారు జగన్. లాక్ డౌన్ కష్టాల్లో కూడా వ్యవసాయ పనులు ఆగకుండా నిబంధనలు సడలించి రైతులకు ఏ ఇబ్బందీ రాకుండా చూస్తున్నారు. కరోనా కష్టాల్లోనూ రైతు భరోసా అందిస్తామని ప్రకటించారు. పొదుపు సంఘాలకు సున్నా వడ్డీ కింద 1400 కోట్ల రూపాయలు నిధులు బ్యాంకుల్లో జమచేసి చేసి శెహభాష్ అనిపించుకున్నారు.

జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన.. నిధులు విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఇళ్ల పట్టాల కార్యక్రమాన్ని అడ్డుకుంటూ, కోర్టుల్లో కొర్రీలు వేస్తున్న తరుణంలో కూడా వాటి గురించి ప్రత్యేక శ్రద్ధతో ఆలోచిస్తున్న ఏకైక సీఎం జగన్ కాక ఇంకెవరు. కరోనా కల్లోలం లేకపోతే ఉగాది నాటికి ప్రతి పేదవాడికీ ఇళ్ల పట్టా అందించాల్సిన పరిస్థితి. తాజాగా జులై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జులై-8న 27లక్షలమంది పేదలకు ఇళ్లపట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు కరోనా కట్టడిపై ఏపీని దేశానికే ఆదర్శంగా మార్చారు జగన్. అత్యథిక వ్యాధి నిర్థారణ పరీక్షలు జరుగుతున్న రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందంటే ఆ ఘనత జగన్ ది కాక ఇంకెవరిది. పొరుగు రాష్ట్రంలో ప్రశాంతంగా కూర్చున్ను చంద్రబాబు.. జగన్ సర్కారుపై బురదజల్లాలని చూస్తున్నా కూడా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు జగన్.

మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా కట్టడితోనే సతమతమవుతున్న వేళ, ఏపీ సీఎం జగన్ మాత్రం కరోనా కష్టకాలంలో కూడా మిగతా అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. నవరత్నాల అమలుతోనే సీఎం జగన్ పాలనా దక్షత ఏంటనేది అందరికీ తెలిసొచ్చింది. ఇప్పుడీ కరోనా కాలం కూడా జగన్ నాయకత్వ పటిమను మరోసారి అందరికీ తెలిసేలా చేసింది.

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా