పవన్ విరూపాక్ష కాదు..పాలిటిక్సూ లేదు.

పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తయారయ్యే సినిమాకు విరూపాక్ష అనే పేరును మీడియా ఎప్పుడో ఖరారు చేసేసింది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. ఈ సినిమా టైటిల్ విరూపాక్ష కాదు. ఆ టైటిల్…

పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో తయారయ్యే సినిమాకు విరూపాక్ష అనే పేరును మీడియా ఎప్పుడో ఖరారు చేసేసింది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం. ఈ సినిమా టైటిల్ విరూపాక్ష కాదు. ఆ టైటిల్ లో క్రిష్ తన దగ్గర వున్న వేరే ప్రాజెక్టుల కోసం రిజిస్టర్ చేసి వుంచుకున్నది తప్ప వేరు కాదు. టైటిల్ విషయంలో ఇంకా పవన్  దగ్గర నుంచి ఫైనల్ డెసిషన్ రాలేదు. క్రిష్ కూడా ఇంకా ఒకటి రెండు ఆప్షన్లు ఇవ్వాల్సి వుంది.

ఇదిలా వుంటే ఈ సినిమాలో ఓ తుగ్గక్ లాంటి రాజు క్యారెక్టర్ వుందంటూ గ్యాసిప్ అల్లేసారు.  ఏపి సిఎమ్ జగన్ ను దృష్టిలో పెట్టుకుని క్రిష్ ఇలాంటి పాత్ర అల్లారని, పవన్ పొలిటికల్ సెటైర్లు వేస్తారని అన్యాపదేశంగా కథలు అల్లేసారు. కానీ క్రిష్ అలాంటి కాంట్రావర్సీల జోలికి పోవడం లేదని తెలుస్తోంది. 

పవన్ సినిమా పక్కా ఓ రాబిన్ హుడ్ కథ. పెద్ద‌లను కొట్టి పేదలకు పెట్టే ఓ దొంగ కోహినూర్ వజ్రం మీద కన్నేసిన నేపథ్యంలో జరిగే సంఘటనలే సినిమా. పవన్ ను రాబిన్ హుడ్ మాదిరిగా పేదల పెన్నిధిగా, వీరుడిగా ప్రెజెంట్ చేయడం, అతని పర్సనల్ గ్లొరిఫై తప్ప, వేరే వాళ్ల మీద సెటైర్లు వుండవని తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు విషయంలో క్రిష్ చాలా జాగ్రత్తగా వుంటున్నారు.. కథానాయకుడు-మహానాయకుడు నేఫథ్యంలో ఆయన ఇమేజ్ కొంత దెబ్బతింది. ఇప్పుడు అనవసరంగా రాజకీయ పరమైన స్టాండ్ లు తీసుకుని, ప్రభుత్వాలకు ఎదురీదే అయిడియా అయితే ఆయనకు లేదు. పవన్ తో ఎలాగైనా ఓ మంచి సినిమా తీసి, మళ్లీ తన ఇమేజ్ ను బిల్డ్ చేసుకోవడం ఒక్కటే ఆయన ఆలోచన అని తెలుస్తోంది.

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా