దారుణం.. 2 లక్షలు దాటిన కరోనా మరణాలు

ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి లక్షలాది మంది చనిపోవడం చూశాం. కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఓ వైరస్ కారణంగా లక్షల మంది చనిపోవడం మాత్రం ఈ దశాబ్దాల కాలంలో ఇదే…

ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి లక్షలాది మంది చనిపోవడం చూశాం. కానీ ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత ఓ వైరస్ కారణంగా లక్షల మంది చనిపోవడం మాత్రం ఈ దశాబ్దాల కాలంలో ఇదే ప్రథమం. అలా కరోనా వైరస్ ప్రపంచానికి సవాల్ విసిరింది. ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. ఎంతలా అంటే.. మృతుల సంఖ్య ఏకంగా 2 లక్షలు దాటేసింది.

అవును.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతిచెందిన వారి సంఖ్య 2 లక్షలు దాటింది. 207 దేశాల్లో 29 లక్షల మందికి వ్యాపించిన ఈ మహమ్మారి.. ప్రస్తుతానికి 203289 మందిని కబలించింది. ఓవైపు వైరస్ వ్యాప్తి తగ్గిందంటూ ప్రపంచఆరోగ్య సంస్థ ప్రకటించినప్పటికీ.. మరోవైపు ఆల్రెడీ వైరస్ సోకిన వ్యక్తులు మృత్యువాత పడుతుండడం ఆందోళన కలిగించే అంశం. అగ్రరాజ్యం అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అందర్నీ కలవరపెడుతున్నది ఈ కోణమే. ఇన్ని రోజులైనా వైరస్ కు యాంటీడోస్ కనుక్కోలేకపోవడం ఈ దుస్థితికి కారణం.

ఇక దేశాలవారీగా చూస్తే.. కరోనా దెబ్బకు అత్యథికంగా ప్రభావితమైన దేశం అమెరికా. నిన్నటికినిన్న ఈ దేశంలో మరో 2వేల మంది మృత్యువాతపడ్డారు. ఫలితంగా యూఎస్ లో మరణాల సంఖ్య 54,256కు చేరింది. ప్రస్తుతం ఆ దేశంలో 9,60,651మంది కరోనా బాధితులున్నారు. ఓవైపు వైరస్ వ్యాప్తి తగ్గిందని ప్రకటించిన అమెరికాలోనే, నిన్న ఒక్క రోజు 35,419 మందికి కొత్తగా వైరస్ సోకింది.

ఇటలీలో నిన్న 415 మంది మరణించారు, మొత్తం మృతుల సంఖ్య 26,384కు చేరుకుంది. అటు స్పెయిన్ లో 22,902 మంది, ఫ్రాన్స్ లో 22,614 మంది కరోనా కారణంగా మృతిచెందారు. కరోనా పుట్టిన చైనాలో నిన్న కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. కొత్త కేసులు కూడా కేవలం 12కు మాత్రమే వెలుగుజూశాయి. ప్రస్తుతం ఆ దేశంలో 82వేల మంది మాత్రమే కరోనా బాధితులున్నారు. అమెరికా, స్పెయిన్, ఇటలీతో పోల్చి చూస్తే ఈ సంఖ్య చాలా చిన్నది.

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా