జ‌గ‌న్ ఇదేం పాల‌న‌…వాళ్లు క్ష‌మించ‌రు జాగ్ర‌త్త‌!

ఏపీ యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న ఎంత మాత్రం బాగాలేదు. ఎందుకంటే ఆయ‌న తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న‌కు వంత పాడే ఎల్లో మీడియాకు ఏ మాత్రం న‌చ్చేలా లేవు.…

ఏపీ యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పాల‌న ఎంత మాత్రం బాగాలేదు. ఎందుకంటే ఆయ‌న తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ఆయ‌న‌కు వంత పాడే ఎల్లో మీడియాకు ఏ మాత్రం న‌చ్చేలా లేవు. ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి ఆర్థికంగా రాష్ట్రాన్ని కుదేలు చేస్తుంటే…ఏమీ కాన‌ట్టు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు సున్నా వ‌డ్డీ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తూ వాళ్ల సంఘాల్లోకి రూ.1400 కోట్లు జ‌మ చేశార‌ని ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియా లోలోన క‌డుపు మండి చ‌చ్చిపోతున్నాయి. ఈ బాధ చాల‌ద‌న్న‌ట్టు వ‌రుస పెట్టి వాళ్ల‌ను ఇబ్బందుల‌కు గురి చేసే మ‌రో నిర్ణ‌యాన్ని జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకోవ‌డం న్యాయ‌మా?

అనంత‌పురం జిల్లాలో మ‌రో రెండు భారీ ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు లైన్ క్లియ‌ర్ చేస్తూ జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌తిప‌క్ష టీడీపీ, ఎల్లోమీడియా ఎంత మాత్రం క్ష‌మించ‌దు గాక క్ష‌మించ‌దు. అస‌లే అనంత‌పురం నుంచి కియా ప‌రిశ్ర‌మ‌ను పార‌గొట్టాల‌ని శ‌క్తి వంచ‌న లేకుండా ప్ర‌తిప‌క్ష టీడీపీ, సీపీఐ, ఎల్లో మీడియా చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ బూడిద‌లో పోసిన ప‌న్నీర‌య్యాయి. కియా ప‌రిశ్ర‌మ త‌ర‌లిపోక పోగా, మ‌రో రెండు ప‌రిశ్ర‌మ‌లు అదే జిల్లాకు తీసుకురావ‌డం జ‌గ‌న్‌కు న్యాయంగా అనిపిస్తోందా?

అస‌లు జ‌గ‌న్ లాంటి నియంత పాల‌న‌లో ఏపీకి ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం ఏంటి? ఏమైంది ఈ ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల‌కు?  ప్ర‌తిప‌క్ష టీడీపీ విమ‌ర్శ‌లు, ఎల్లో మీడియా క‌థ‌నాలు ప‌రిశ్ర‌మ‌ల య‌జ‌మానుల‌కు రుచించ‌లేదా? ఈ జ‌గ‌న్ మాట‌లు వాళ్ల‌కి అంత తీయ‌గా ఉన్నాయా? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీర్‌ వాహన్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ఎలక్ట్రికల్‌ బస్‌ యూనిట్‌తో పాటు ఏపీ ఏరోస్పేస్‌ డిఫెన్స్‌ పార్కు నిర్మాణాలు ప్రారంభం అయ్యేందుకు జ‌గ‌న్ స‌ర్కార్ మార్గం సుగుమం చేయ‌డం ఏంటి?  

అనంతపురం జిల్లాలో కియా మోటర్స్‌ పరిశ్రమ  చుట్టుపక్కల 10 కి.మీ పరిధి వరకు ఎలాంటి కాలుష్య కారకమైన పరిశ్రమలు ఏర్పాటు చేయకూడదంటూ 2017లో జీవో నెంబర్‌ 151 ద్వారా ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో అప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న‌ ఈ రెండు పరిశ్రమలు వెన‌క్కి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఆ జీవో నుంచి ఈ పరిశ్రమలకు మినహాయింపు ఇస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ  ఉత్తర్వులిచ్చారు. దీంతో కియా కంటే ముందే పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నందున ఈ రెండు పరిశ్రమలకు ఈ జీవో నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

వీర్‌వాహన్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో 120 ఎకరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులు తయారీ యూనిట్‌, , ఏపీఐఐసీ భాగస్వామ్యంతో 246.06 ఎకరాల్లో  ఏపీ ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్‌ ఎలక్ట్రానిక్స్‌ పార్క్ ఏర్పాటుకు  అడ్డంకులు తొలిగాయి. ఒక వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విధ్వంసం సృష్టిస్తున్నా, మ‌రోవైపు జ‌గ‌న్ సర్కార్ మాత్రం త‌న ప‌ని తాను ఎలాంటి ప్ర‌చార ఆర్భాటం లేకుండా చేసుకుపోతోంది. సంక్షేమ‌, అభివృద్ధి బాట‌లో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌యాణించ‌డాన్ని బాబు, ఆయ‌న ఎల్లో మీడియా త‌ట్టుకోలేక‌పోతోంది. అయితే ఈ రెండు ప‌రిశ్ర‌మ‌ల ఘ‌న‌త త‌మ‌దేన‌ని బాబు చెప్పే అవ‌కాశాలు లేక‌పోలేదు. 

పుట్టిన రోజు ఇలా కూడా చేసుకుంటారా