తమ్ముళ్లకు పండగ లేకుండా చేస్తున్న బాబు

అమరావతి డిమాండ్ ఆ 29 గ్రామాల ప్రజలకే పరిమితం కావడం, రాష్ట్ర ప్రజలంతా మూడు రాజధానులే కోరుకోవడంతో.. చంద్రబాబు మిగతా ప్రాంతాల్లో పర్యటనలు మొదలుపెట్టారు. అమరావతి దాటి.. సీమలో అడుగు పెట్టారు. పెయిడ్ ఆర్టిస్ట్…

అమరావతి డిమాండ్ ఆ 29 గ్రామాల ప్రజలకే పరిమితం కావడం, రాష్ట్ర ప్రజలంతా మూడు రాజధానులే కోరుకోవడంతో.. చంద్రబాబు మిగతా ప్రాంతాల్లో పర్యటనలు మొదలుపెట్టారు. అమరావతి దాటి.. సీమలో అడుగు పెట్టారు. పెయిడ్ ఆర్టిస్ట్ లు ఎక్కడైనా ఒకటే కాబట్టి.. సీమలో కూడా బాబుకి విరాళాలు బాగానే ముట్టాయి. మాకు హైకోర్టు వద్దు, అభివృద్ధి అంతా అమరావతిలోనే పెట్టుకోండని రాయలసీమ ప్రజలు చంద్రబాబుతో అంటారా? బాబు చేస్తున్న వింత వాదనని సమర్థిస్తారా?

ఈ విషయాలు తెలియక కాదు, తెలిసి కూడా చంద్రబాబు సీమలో అడుగు పెట్టారు. చుట్టూ తనవాళ్లనే పెట్టుకుని మహబాగా నటించారు. సీమ మాట ఇదీ అంటూ తన అనుకూల మీడియాలో గొంతెత్తి చాటారు. ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా చంద్రబాబు పర్యటనలకు షెడ్యూల్ ఖరారవుతోంది. అయితే పండగ వేళ తమని ఇబ్బంది పెట్టడం సరికాదంటూ మిగతా ప్రాంతాల టీడీపీ నేతలు బాబుకి విన్నవించుకుంటున్నారట.

చేసేదే పెద్ద డూప్లికేట్ ఉద్యమం, అందులోనూ పండగని వదిలేసుకుని ఆరోజు చంద్రబాబు వెంట ఉండాలంటే మాకు కుదరదు అని మొహం మీదే చెప్పేస్తున్నారట. పైపెచ్చు.. అలాంటి ఫెస్టివల్ టైమ్ లో పెయిడ్ ఆర్టిస్ట్ లను తేవడం, సభలకు జనాన్ని పోగు చేయడం కూడా కష్టమైన పనే. అందుకే చంద్రబాబు పర్యటనను ఉత్తరాంధ్ర సహా మిగతా ప్రాంతాల నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో వద్దని చెబుతున్నారు.

తిరుపతిలో జేఏసీ ప్రదర్శన తర్వాత నెక్స్ట్ ఎక్కడ అనే ప్రకటన అందుకే ఆలస్యమవుతోంది. అటు అమరావతి రైతులు కూడా పండగ వేళ కాస్త విరామం ఇవ్వండి బాబూ అని కోరుకుంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం పండగ టైమ్ లో కూడా పాడు రాజకీయాలకు సై అంటున్నారు. ఉద్యమానికి విరామం లేదంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు. దీంతో పండగ రోజు బాబు ఎక్కడికొస్తారో అంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకున్నారు