మంత్రి కొడాలి నాని షాకింగ్ మేటర్ బయటపెట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తన పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాంబ్ పేల్చారు. ప్రస్తుతం బాబు అదే ప్రయత్నాల్లో ఉన్నారని.. తమకు ఆ విషయాలన్నీ ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయని అన్నారు కొడాలి నాని.
“నువ్వు బీజేపీతో మాట్లాడుతున్నావనే విషయం మాకు తెలుసు. నీ టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నిస్తున్నావని మాకు తెలుసు. లోకేష్ ఏం చేయలేడనే విషయం తెలిసి విలీనం వైపు చంద్రబాబు వెళ్తున్నాడు. 2024లో తన పార్టీ జగన్ కు పోటీ ఇవ్వలేదనే విషయం చంద్రబాబుకు తెలుసు. ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే, ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదనే విషయం బాబుకు తెలుసు. అందుకే బీజేపీతో మాట్లాడుకొని, విలీనం కోసం ప్రయత్నిస్తున్నాడు బాబు.”
నిజంగా బాబు ప్రయత్నాలు ఫలించి, విలీనం జరిగితే ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దరిద్రం, నక్కజిత్తుల రాజకీయాలు వదిలిపోతాయన్నారు నాని. రాష్ట్రంలో అన్ని కులాలు, మతాల వ్యక్తులు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటుుంటే.. బాబు, లోకేష్ మాత్రం పనిలేకుండా మిగిలిపోయారని ఎద్దేవా చేశారు.
“కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని ఎన్నికల టైమ్ లోనే జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే కార్పొరేషన్లు క్రియేట్ చేసి ఆయా కులాల వాళ్లకు సముచిత స్థానం ఇచ్చారు. కార్పొరేషన్లు ఉంటే ఆయా కులాల సమస్యల్ని సత్వరం పరిష్కరించడానికి అవకాశం ఉంటుందనేది జగన్ ఆలోచన. ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారు. అప్పట్లో ఆ పని చేయకుండా ఇప్పుడు జగన్ పై ఏడుపు. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని వర్గాల్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తుంటే.. చంద్రబాబు, లోకేష్ మాత్రమే ఈ రాష్ట్రంలో పనిలేకుండా మిగిలిపోయారు.”
ఉన్నతమైన ఆశయాలు, విలువలతో నడుచుకుంటున్న ముఖ్యమంత్రిపై బురదజల్లే బదులు.. బాబు-లోకేష్ కలిసి ఇందేమైనా పని చూసుకుంటే బెటరన్నారు నాని.