మే నెల కూడా బ్యాంకులు అంతంతమాత్రమే!

ఈనెల బ్యాంకులకు ఏకంగా 12 రోజులు శెలవులు వచ్చాయి. నిన్నటితో ఆ 12 రోజుల శెలవులు పూర్తయ్యాయి. గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమి, అంబేద్కర్ జయంతి లాంటి చాలా హాలిడేస్ వచ్చాయి. అయితే ఆశ్చర్యంగా…

ఈనెల బ్యాంకులకు ఏకంగా 12 రోజులు శెలవులు వచ్చాయి. నిన్నటితో ఆ 12 రోజుల శెలవులు పూర్తయ్యాయి. గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామనవమి, అంబేద్కర్ జయంతి లాంటి చాలా హాలిడేస్ వచ్చాయి. అయితే ఆశ్చర్యంగా మే నెలలో కూడా బ్యాంకులకు 12 రోజులు శెలవులు వచ్చాయి.

వచ్చేనెల బ్యాంకులు పనిచేసేది 19 రోజులు మాత్రమే. దీనికితోడు కరోనాతో బ్యాంకుల పనిదినాల్ని కూడా బాగా కుదించారు. కాబట్టి మే నెలలో కూడా బ్యాంకు లావాదేవీల్ని కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోండి. లేదంటే ఇబ్బందులు పడక తప్పదు.

మేడే నుంచి బ్యాంకు శెలవులు ప్రారంభం అవుతున్నాయి. ఆ వెంటనే ఆదివారం వచ్చింది. అలా నెల ప్రారంభంలోనే 2 రోజులు బ్యాంకులు పనిచేయవన్నమాట. ఇక మే 7, 8, 9వ తేదీలు కూడా బ్యాంకులకు శెలవు. ఆ 3 రోజుల్లో రెండో శనివారం పడింది.

వీటితో పాటు రంజాన్ టైమ్ లో వరుసగా శెలవులు పడ్డాయి. 13 (ఈదుల్ ఫితర్), 14 (రంజాన్),16 (ఆదివారం) తేదీలు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత 22 (నాలుగో శనివారం), 23 (ఆదివారం), 26 (బుద్ధ పూర్ణిమ), 30 (ఆదివారం) తేదీల్లో కూడా బ్యాంకులు మూసేసి ఉంటాయి.

పనిచేసే ఆ 19 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే బ్యాంకులు తెరుచుకొని ఉంటాయి. ఈ మేరకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రకటన జారీచేసింది. సో.. ఈ నెలలాగానే, మే నెలలో కూడా లావాదేవీల విషయంలో కాస్త ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిందే.