బాలాపూర్ లడ్డు.. ఈ ఏడాది మరో రికార్డు

గణేష్ లడ్డూ వేలంలో బాలాపూర్ ది ప్రత్యేకస్థానం. ప్రతి ఏటా రికార్డులు కొల్లగొట్టడం ఈ ప్రాంతం గణేషుడి ప్రత్యేకత. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ భారీ రేటుకు అమ్ముడుపోయింది. స్థానికంగా ఉంటున్న వ్యాపారవేత్త…

గణేష్ లడ్డూ వేలంలో బాలాపూర్ ది ప్రత్యేకస్థానం. ప్రతి ఏటా రికార్డులు కొల్లగొట్టడం ఈ ప్రాంతం గణేషుడి ప్రత్యేకత. ఈ ఏడాది కూడా బాలాపూర్ లడ్డూ భారీ రేటుకు అమ్ముడుపోయింది. స్థానికంగా ఉంటున్న వ్యాపారవేత్త కొలన్ రామిరెడ్డి, 17 లక్షల 60వేల రూపాయలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి లక్ష రూపాయలు ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయింది బాలాపూర్ లడ్డు.

గణపతి నవరాత్రుల సందర్భంగా బాలాపూర్ లో వినాయకుడి చేతిలో ఈ లడ్డూను ఉంచారు. ఆఖరిరోజు నాడు వేలం వేస్తారు. ఈ లడ్డూను ఎవరు దక్కించుకుంటే వాళ్లకు అంతా మంచి జరుగుతుందని, వ్యాపారంలో వృద్ధి ఉంటుందని స్థానికుల నమ్మకం. అందుకే వేలం పాటలో ఏటా ఈ లడ్డూ ధర రేటు పెరిగిపోతూనే ఉంది. ఈసారి 21 కిలోల లడ్డూను వేలం వేసి 17 లక్షల 60వేల రూపాయలకు అమ్మారు బాలాపూర్ గణేశ్ సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు.

1994 నుంచి బాలాపూర్ లడ్డూను వేలం వేయడం ప్రారంభించారు. తొలిసారి వేసిన వేలంలో కేవలం 450 రూపాయలకు అమ్ముడుపోయిన ఈ లడ్డూ క్రమంగా లక్షల్లోకి ఎగబాకింది. ఈసారి వేసిన వేలంపాటలో 19 మంది పాల్గొన్నారు. ఈ లడ్డూ వేలం పాటకు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 

జగన్… గారాబం చేయడం నేర్చుకోవాలి!